Moviesహవ్వ..ఛీ ఛీ..తాప్సీ చేసిన పనికి..అంతా సర్వ నాశనం..!?

హవ్వ..ఛీ ఛీ..తాప్సీ చేసిన పనికి..అంతా సర్వ నాశనం..!?

తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు…ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో ఒకటి అనుకుంటే మరోకటి జరుగుతుంది. బాగా హిట్ అవుతాయి అనుకున్న సినిమాలు తుస్సు మని పోతున్నాయి. స్టార్ హీరోలు..వాళ్ళ కొడుకుల సినిమాలు దారుణమైన టాక్ సంపాదించుకుంటున్నాయి. కానీ, యంగ్ హీరోలు..ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..నెపొటిజం వల్ల బాధపడిన హీరోలు మాత్రం..సూపర్ హిట్ లు అందుకుంటున్నారు.

ఇలాంటి టైంలోనే తాప్సీ చేసిన ప్రయోగం సర్వ నాశనం అయిపోయింది. ఈ మధ్య కాలంలో సినీ ప్రమోషన్స్ ను బాగా హైలెట్ చేస్తున్నారు మేకర్స్. సినిమా ఎలా తీసినా..ప్రమోషన్స్ మాత్రం అందరికి రీచ్ అయ్యేలా..సరికొత్తగా చేయాలని భావిస్తున్నారు..అలానే తాప్సీ కూడా..ఢిఫరెంట్ గా ట్రై చేసింది. తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్ కస్యాప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “దొబారా”. ఈ సినిమా ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

అందరు మేకర్స్ లానే ఈ సినిమాను ఢిఫరెంట్ గా ప్రమోట్ చేయాలి అనుకున్నారు..మేకర్స్. ఈ క్రమంలోనే “లాల్ సింగ్ చద్దా మూవీలా నే మా సినిమాను బ్యాన్ చేయాలని ఎవ్వరైనా కోరుకుంటే బాగుండు..సినిమాకి మంచి ప్రమోషన్స్ దక్కుతాయి”అంటూ చెప్పుకొచ్చారు. కానీ, అది వర్క్ అవుట్ అవ్వకపోగా..నిజంగానే ఈ సినిమా బ్యాన్ చేయాలి అంటూ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు. గతంలో అనురాగ్ కాశ్యప్ నరేంద్ర మోడీ పై చేసిన వ్యాఖ్యలను మళ్ళీ ట్రెండ్ చేస్తూ..ఆయన సినిమా బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తాప్సీ ఆశలు నిరాశగానే మిగిలాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news