Moviesఛార్మీ అమ్మ..పూరి నాన్న..స్టేజీ పైనే అస్సలు మ్యాటర్ చెప్పేసిన స్టార్ హీరో...

ఛార్మీ అమ్మ..పూరి నాన్న..స్టేజీ పైనే అస్సలు మ్యాటర్ చెప్పేసిన స్టార్ హీరో ..!!

సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ చాలా కామన్.హిట్ పడని హీరో, హీరోయిలు ఉంటారు ఏమో కానీ..పుకార్లు వస్తుంటాయి. కానీ, ఒక్కే వార్త కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తుంటే.. అవి పట్టించుకోకుండా ఆ జంట ఆ వార్తలకి తగ్గట్లు రాసుకుని పూసుకుని తిరుగుతూ..మీడియా కంట పడుతుంటే…వీటన్నింటికి మించి..ఓ స్టార్ హీరో ఆ విషయం పై స్పందిస్తే..అబ్బో ఆ రచ్చ ఆ ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు..ఇప్పుడు అదే పోజీషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్.

మనకు తెలిసిందే ..పూరీ జగన్నాధ్ ప్రజెంట్ తన ఆశలన్ని లైగర్ సినిమా పైనే పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమా హిట్ అయితే పూరీ పేరు ఎలా మారుమ్రోగిపోతుందో..ఫ్లాప్ అయితే..పాతాళానికి పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే, పూరీ చాలా జాగ్రత్తగా..ఈ సినిమా ని తెరకెక్కించారు. ప్రమోషన్స్ కూడా బాగానే ప్లాన్ చేసి చేస్తున్నారు. ఈ క్రమంలో నే వరంగల్ లో లైగర్ టీ సందడి చేసింది. విజయ్ స్పీచ్ యువత కు కొత్త ఊపునిచ్చింది.

అయితే, విజయ్ స్పీచ్ అందరికి నచ్చినా..మాటల మధ్యలో పూరీ ని నాన్న అని..ఛార్మీని అమ్మ అని సంబోధించడం..ఇప్పుడు సర్వత్ర హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..”నా పై మీరు చూయిస్తున్న ప్రేమకి చాలా ధ్యాంక్స్. నేను ఇంకా చిన్నపిల్లాడినే..అప్పుడే సూపర్ స్టార్ ని చేయకండి..అలా పిలుస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. మేం హైద్రాబాద్ నుంచి బాంబేకి వెళ్లాం. పూరి మా నాన్నలా, ఛార్మీ మా అమ్మలా.. మేం ముగ్గురం కలిసి బయల్దేరాం.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎవ్వడు అడ్డు వచ్చినా వినేది లేదని ఆ నాడే ఫిక్స్ అయ్యాం. వుయ్ ఆర్ ఇండియన్స్.. ‘పోదాం.. కొట్లాడుదాం.. ఆగ్ హై అందర్.. దునియా ఆగ్ లగా దేంగే..వాట్ లగా దేంగే..” అంటూ యువతకు కొత్త ఊపు నిచ్చాడు లైగర్. కానీ, ఇక్కడ ఛార్మీని అమ్మ, పూరీ ని నాన్న అన్న పాయింట్ ని ట్రోలర్స్ బాగా క్యాచ్ చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. పాపం విజయ్ ఏదో చెప్పాలి అనుకుని..ఇలా ఇరుక్కుపోయాడు అంటున్నారు సినీ విశ్లేషకులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news