Moviesముస‌లి ఏజ్ వ‌చ్చేసినా అమ్మాయిల‌తో ఆ విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌ని నాగార్జున‌...!

ముస‌లి ఏజ్ వ‌చ్చేసినా అమ్మాయిల‌తో ఆ విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌ని నాగార్జున‌…!

కింగ్ నాగార్జున ఏజ్ బారవుతున్నా అది తగ్గడం లేదు..చాలా గ్రేట్ అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. తన అన్నపూర్ణ సంస్థ ద్వారా చాలా వరకూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. నాగ్ ద్వారా 24 విభాగాలకు చెందిన వారు ఇండస్ట్రీకి పరిచయమై స్టార్స్‌గా ఎదుగుతున్నారు. ముఖ్యంగా దర్శకులను నాగార్జున చిత్రపరిశ్రమకి పరిచయం చేయడం గొప్ప విషయం అని చెప్పాలి. అయితే నాగార్జున ఏజ్ ఇప్పుడు 60 దాటింది.

అయినా ఏజ్‌కి సంబంధం లేకుండా ఒకవైపు మాంచి రొమాంటిక్ సినిమాలు చేస్తూనే మరోవైపు వైల్డ్ డాగ్ లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్‌గా లైన్ చెప్తే ఏకంగా దర్శకుడిగా అవకాశమిచ్చారు నాగార్జున. ఈ సినిమా కోసం చాలా శ్రమించారు కూడా. సాధారణంగా అయితే, ఏజ్‌కు తగ్గ సినిమాలు చేస్తూ సేఫ్‌గా ఉంటారు. కానీ, నాగార్జున దానికి వ్యతిరేకం. ప్రయోగం అనిపిస్తే రెడీ అయిపోతారు.

ఇప్పుడు చేస్తున్న ప్రయోగం కూడా అలాంటిదే. ఆ సినిమానే ది ఘోస్ట్. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. హీరోయిన్‌తో రొమాన్స్ కూడా ఉంది. ఇవి నాగ్‌కు అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిందీలో వచ్చిన పింక్ లాంటి సినిమాలు చేయొచ్చు కాదా ? అని మాట్లాడుకుంటున్నారు. అయినా నాగార్జునలో ఉన్న డబుల్ ఎనర్జీ ఇంకా హీరోయిన్స్‌తో డాన్సులు, రొమాన్స్, ఫైట్స్ చేయిస్తున్నాయి.

ఇక అదే డబుల్ ఎనర్జీ బిగ్ బాస్ షోను నడిపిస్తున్నారు. తెల్ల వెంట్రుకలు..ఒంటిపై ముడతలు కనిపిస్తున్నా కవర్ చేస్తూ నవ‌ యువకుడిలా కనిపిస్తున్నారు. ఇంకా మన్మధుడిగా కనిపిస్తున్న నాగ్‌కి ఫ్యాన్స్‌లో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు కొందరు ముసలి హీరోలకి కుర్ర భామలెందుకు అని కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్ లిస్ట్‌లో మన మన్మధుడు కూడా ఉన్నారు. ఏదేమైనా అభిమానులు చూస్తున్నంతకాలం తప్పదు మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news