Moviesలైగర్ ఫ్లాప్ అయితే.. విజయ్ దేవరకొండ పరిస్ధితి ఇంత దారుణంగా ఉంటుందా..?...

లైగర్ ఫ్లాప్ అయితే.. విజయ్ దేవరకొండ పరిస్ధితి ఇంత దారుణంగా ఉంటుందా..? షాకింగ్ సర్వే..!

ఓ సినిమా తీయాలంటే మాటలు కాదు . దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ఎంతో ప్లానింగ్ ఉంటుంది. అలా ప్లానింగ్ చేసుకుని తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి . టైం బాగ లేక కావచ్చు.. కథలో కంటెంట్ లేక కావచ్చు.. ఏదైనా కానివ్వండి సినిమా అయితే ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బిగ్ స్టార్ సినిమాస్ కూడా ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ బడ్జెట్ తో తీసిన బడా సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.

పాపం ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది లైగర్ సినిమా టీంకు. మనకు తెలిసిందే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అన్నయ్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లైగర్ . ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు పూరి జగన్నాధ్. అయితే రీజన్స్ ఏంటో తెలియదు కానీ సడెన్ గా సినిమాని బాయ్ కాట్ చేయాలని కొందరు నెటిజన్స్ నెట్టింట ట్రెండింగ్ లోఖి తీసుకొచ్చారు. దానికి మెయిన్ కారణం విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటున్నారు కొందరు జనాభా.

ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కాలు పైకి ఎత్తి మాట్లాడడం.. ట్రైలర్ ఈవెంట్లో కూడా విజయ్ దేవరకొండ రెచ్చిపోయి మరి మిగతా హీరోలపై పరోక్షంగా కామెంట్ చేయడం.. కొందరి హీరో అభిమానులకు నచ్చలేదు. ఈ కారణంగానే లైగర్ సినిమా ఫ్లాప్ అయితే విజయ్ పరిస్థితి ఏంటి అంటూ కొందరు నెట్టింట పోల్ క్రియేట్ చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎక్కువ శాతం విజయ్ సినిమా ఫ్లాప్ పోతుందని చెప్పారు . ఓవర్ ప్రమోషన్స్.. అంతకుమించిన విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ..ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటున్నారు.

మరోపక్క అమ్మనాన్న ఓ తమిళమ్మాయి కథ కాదు అంటున్నారే ..కానీ ఈ సినిమాలో సీన్స్ అన్ని అలానే ఉన్నాయంటూ మరో రూమర్ కూడా వైరల్ గా మారింది. దీంతో సినిమా ఫ్లాప్ అయితే విజయ్ దేవరకొండ మొత్తంగా బాలీవుడ్ చెక్కేస్తాడని టాలీవుడ్ లో ఉండడని ఓవర్గం అంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే సినిమా ఫ్లాప్ అయితే పూరి జగన్నాథ్ కెరీర్ ఇక ముగిసినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మీరు ఏం అనుకుంటున్నారు..విజయ్ దేవరకొండ లైగర్ మూవీ హిట్ అవుతుందా..? లేక ఫ్లాప్ అవుతుందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news