Movies"నీ స్దాయి తెలుసుకో.."..నవీన్ చంద్రను ఘోరంగా అవమానించిన మెగా హీరోయిన్..!?

“నీ స్దాయి తెలుసుకో..”..నవీన్ చంద్రను ఘోరంగా అవమానించిన మెగా హీరోయిన్..!?

ఈ రోజుల్లో డబ్బు ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డబ్బు లేకపోతే సాటి మనిషికి.. ఒక మనిషిలా కనీసం మనిషిలా కూడా కనిపించడు. ప్రజెంట్ సొసైటీలో మన జీవన విధానంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది. అది నిజమే సామాన్యులైన.. సెలబ్రిటీలైన.. ఎవరికైనా డబ్బు చాలా ఇంపార్టెంట్ అది ఉంటేనే ఎదుటివారు మనల్ని గౌరవిస్తారు ఈ విషయం చాలామందికి తెలిసిందే. కాగా మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బు లేక అవమాన పడ్డ హీరోలు చాలామందే ఉన్నారు.

అలాంటి లిస్టులోకే వస్తాడు ఈ హీరో నవీన్ చంద్ర. ఈ పేరుకు పెద్దగా కొత్త పరిచయాలు అవసరం లేదు. మనకు తెలిసిన అబ్బాయినే. సహజ సిద్ధంగా నటించే టాలెంట్ ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీరోగానే కాదు విలన్ గా కూడా మెప్పించిన నవీన్ చంద్ర ప్రజెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు . రీసెంట్ గా పరంపర వెబ్ సిరీస్ లో నటించిన అద్భుతమైన నటనతో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న నవీన్ చంద్ర ..కోలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు అందుకున్నాడు.

కాగా నవీన్ చంద్ర కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాడట. ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్ గా అందరికీ ఉన్నవే.. కానీ, ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ను చూపిస్తూ ఓ హీరోయిన్ నవీన్ చంద్రాను దారుణంగా మాట్లాడిందట. మెగా హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసే ఓ సో కాల్డ్ హీరోయిన్ నవీన్ చంద్ర తో కూడా సినిమా చేసింది. అయితే ఆ సినిమా టైంలో మాత్రం అమ్మడు చాలా కూల్ గా చాలా మర్యాదగా మాట్లాడుతూ వచ్చిందట. సినిమా హిట్ అవ్వడం కోసం నవీన్ చంద్రతో రాసుకొని పూసుకుని తిరిగి ప్రేమ అంటూ పుకార్లు పట్టించుకోని తన పేరు మీడియాలో హైలెట్ గా మార్చుకుంది.

పుకార్ల ప్రభావమో అమ్మడు ఎక్స్పోజింగ్ ప్రభావమో తెలియదు కానీ సినిమా హిట్ అయితే కొట్టింది. కానీ నవీన్ చంద్ర ను మాత్రం దారుణంగా మోసం చేసింది. ప్రేమ పేరుతో నవీన్ చంద్రకు దగ్గర అయ్యిన్నట్లే అయ్యి.. ఆ తర్వాత స్టేటస్ పేరుతో “నువ్వు నా స్థాయికి తగ్గవాడివి కాదు “అంటూ దారుణంగా అవమానించిందట. “ఇండస్ట్రీలో నీ స్థాయి ఏంటో తెలుసుకో” అంటూ నవీన్ చంద్ర బాధపడే లా మాట్లాడిందట. ఆ హీరోయిన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న నవీన్ చంద్ర ఇప్పటివరకు ఆ హీరోయిన్ ముఖం కూడా మళ్లీ చూడలేదట. అంత పౌరుషం గల నవీన్ చంద్ర సొంత టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనను తనలోని టాలెంట్ జనాలకు చూయిస్తున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news