MoviesNTR తో సినిమా..ఫస్ట్ టైం అఫిషీయల్ గా అనౌన్స్ చేసిన జాన్వీ..!!

NTR తో సినిమా..ఫస్ట్ టైం అఫిషీయల్ గా అనౌన్స్ చేసిన జాన్వీ..!!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందానికి అందం, నటనకి నటన రెండింటిలోను అమ్మ కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివిన్నట్లుంది అంటారు ఆమె అభిమానులు. చూసేందుకు సైలెంట్ గా ఉన్నా..జాన్వీ చాలా అల్లరి పిల్ల. అమ్మ పెంపకంలో పెరిగిన అన్ని రోజులు చాలా మంచిగా ఉన్నింది. కానీ, అమ్మ వెల్లిపోయాక ..జాన్వీ కి మంచి చెడు చెప్పే నాధుడే లేడు. ఉన్న బోనీ కపూర్ సినిమా నిర్మాత గా బిజీ అయిపోయాడు.

ఇక జాన్వీ ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ షికార్లు అంటూ వచ్చిన ఆఫర్లని చేజార్చుకుంటుంది అని కూడా అంటుంటారు అభిమానులు. కాగా, ఇన్నాళ్లు బాలీవుడ్ పై కన్నేసిన ఈ బ్యూటి ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది అని ఆమె మాటలు వింటుంటేనే క్లీయర్ గా అర్ధమైపోతుంది. జాన్వీ కపూర్‌ నటించిన గుడ్‌ లక్‌ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ మీడియాతో మాట్లాడుతూ..ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.

మీడియాతో ముచ్చటిస్తున్న జాన్వీ ని రిపోర్టర్స్..” NTR30లో మీరు హీరోయిన్‌గా నటించబోతుందనే రూమర్స్‌ బాగా వినిపిస్తున్నాయి..దాని పై మీ అభిప్రాయం”..అని అడగ్గా..జాన్వీ మాట్లాడుతూ..” NTR సార్ తో సినిమా నా..ఓ మై గాడ్ ..అలాంటి అవకాశం వస్తే చచ్చినా వదులుకోను. నిజంగా ఆయన తో నటించే ఛాన్స్ వస్తే అంతకన్న అదృష్టవంతురాలు ఎవరు ఉంటారు చెప్పండి. కానీ బ్యాడ్‌ లక్‌ ఏంటంటే ఆ సినిమా నుంచి నాకు ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్‌ రాలేదు. వస్తే ఖచ్చితంగా చేస్తా..”అంటూ చెప్పికొచ్చింది. దీంతో జాన్వీ అఫిషీయల్ గా తారక్ సినిమా పై క్లారిటీ ఇచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news