Moviesవెక్కి వెక్కి కెమారా ముందే బోరున ఏడ్చేసిన ప్రియంకా చోప్రా..సంతోషిస్తున్న అభిమానులు(వీడియో)..!!

వెక్కి వెక్కి కెమారా ముందే బోరున ఏడ్చేసిన ప్రియంకా చోప్రా..సంతోషిస్తున్న అభిమానులు(వీడియో)..!!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసి..ఇప్పుడు హాలీవుడ్ సినిమాల వైపు మళ్లింది. తన అందచందాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేసిన ఈ బ్యూటీ..తనకంటే వయసులో చిన్న వాడైన నిక్ ను పెళ్లి చేసుకుని..తన ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఆ తరువాత అమ్మడు చేసిన హంగామా అంతా మనకు తెలిసిందే.

అబ్బో ఆ ఫోటో షూట్లు ..ఆటలు ..పాటలు..ముద్దులు..హగ్గులు ..రచ్చ రంబోలా లా ఉన్నింది. ఆ తరువాత కూడా ప్రియాంకా మనకు ఎప్పుడు సరదా గా నవ్వుతూ నే కనిపించింది తప్పిస్తే..బాధపడలేదు. కానీ, ఫస్ట్ టైం..ప్రియాంకా కన్నీరు పెట్టుకుంది. అది కూడా కెమారాల ముందు. దీంతో ఆమె అభిమానులు కూడా బాధపడ్డారు. ప్రియంకా అంతలా బాధపడటానికి కారణం..తెలిస్తే మన గుండె బరువెక్కుతుంది. కొందరు చిన్నారులను హత్తుకుని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతోంది.

మనకు తెలిసిందే , యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలోనే ఆమె తాజాగా పోలాండ్‌ను సందర్శించింది. ఇక అక్కడే భీకరమైన రష్యా దాడి కారణంగా నిరాశ్రయులైన ఉక్రెయిన్‌కు చెందిన కొందరు చిన్న పిల్లలను చూసి..చలించిపోయింది. ఆ చిన్నారుల ధీన స్థితి చూసి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. వారిని గట్టి హత్తుకుని ఎవ్వరు కంట్రోల్ చేయలేని విధంగా బాగా ఏడ్చేసింది.

ఆ తరువాత తేరుకుని ఆప్యాయంగా వారిని దగ్గరికి తీసుకుని.. వారితో కాసేపు సరదాగా ఆటలాడింది.మాట్లాడింది. వాళ్లకు కొన్ని డ్రాయింగ్ పెయింటింగ్ లను గిఫ్ట్ గా ఇచ్చి,,సరదాగా కబుర్లు చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఎప్పుడు ఎక్స్ పోజింగ్ అని..ఫోటో షూట్లని తిరిగే ప్రియాంకా..ఇలా మంచి పనులు కూడా చేయడం బాగుంది అంటున్నారు అభిమానులు.

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news