Moviesపెళ్లికి ముందే స‌హ‌జీవ‌నంలో సినీ సెల‌బ్రిటీలు...!

పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నంలో సినీ సెల‌బ్రిటీలు…!

లీవ్ ఇన్‌ రిలేష‌న్‌షిఫ్‌ (స‌హ‌జీవ‌నం) అనేది ఇప్ప‌డు మాత్ర‌మే కాదు.. మూడున్న‌ర ద‌శాబ్దాలుగా మ‌న‌ దేశంలో కొన‌సాగుతోంది. ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాల‌కు సంబ‌ధించిన సెల‌బ్రిటీలు
పెళ్లికి ముందే ప్రేమ‌లో ప‌డి స‌హ‌జీవ‌నం చేయ‌టం అనేది చాలా కామ‌న్ అయిపోంది. మ‌రి ముఖ్యంగా సెల‌బ్రిటీ లైఫ్‌లో ఇది చాల సింపుల్ అయిపోయింది. అయితే స‌హ‌జీవ‌నం చేసిన జంట‌లు అన్ని పెళ్ళి చేసుకుంటార‌న్న‌ రూల్ లేదు. ఈ స‌హ‌జీవ‌నం చేసిన జంటల‌లో కొంద‌రు పెళ్ళి చేసుకున్ని ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంట్రి ఇస్తారు. మ‌రికోంద‌రు స‌హ‌జావ‌నం మ‌ధ్య‌లోనే బ్రేక‌ప్ చెప్పేసుకొని ఎవ‌రి దారి వారు చూసుకుంటారు. ఇలా పెళ్లికి ముందె స‌హ‌జీవ‌నం చేసిన కొంద‌రు టాప్ సెల‌బ్రిటీల‌ గురించి తెలుసుకుందాం.

అమీర్ ఖాన్-కిరణ్ రావ్:
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్- కిర‌ణ్ రావ్ జంట పెళ్లికి ముందు క‌లిసి జీవించారు. అమీర్ ఖాన్ హీరోగా వ‌చ్చిన లాగాన్ సినిమాకు కిర‌ణ్ రావ్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌టికే అమీర్ కు పెళ్ల‌య్యి పిపిల్లు కూడా ఉన్నారు. కిర‌ణ్ తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మ‌ర‌డంతో వీరు పెళ్ళికి ముందు రెండు సంవ‌త్స‌రాల పాటు స‌హ‌జీవ‌నం చేశారు.ఇటీవ‌ల‌ ఈజంట విడిపోయిన సంగ‌తి తెలిసిందే.

కరీనా కపూర్ ఖాన్ -సైఫ్ అలీ ఖాన్ :
బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ ఆలీ ఖాన్, క్రేజీ హీరోయిన్ క‌రీనా క‌పూర్ పెళ్ళికి ముందు క‌లిసి చాలా ఏళ్ల‌పాటు స‌హ‌జీవ‌నం చేశారు. అప్ప‌టికే సైఫ్‌కు త‌న‌కంటే వయ‌సులో పెద్ద‌దైన అమృతా సింగ్ తో పెళ్లి అవ‌టంతో పాటు పిల్ల‌లు కూడా ఉన్నారు. తర్వాత వీరిద్ద‌రు 2010లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌ర‌కు తైమూర్ అనే కూమ‌రుడు ఉన్నాడు.

సోహా అలీఖాన్ – ఖునాల్..
సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీఖాన్‌- ఖూనాల్ ఇద్ద‌రు క‌లిసి స‌హ‌జీవనం చేశారు. అయితే వారి స‌హ‌జీవ‌న సంబందం వారి పెళ్ళి స‌మ‌యంలో బ‌య‌ట ప‌డింది. ఖూనాల్ కంటే ముందు సౌత్ హీరో సిర్థ్ తో కూడా స‌హ‌జీవ‌నం చేసినాటు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తేలిసిందే.

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ :
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జంట పెళ్లికి ముందు చాలా ఏళ్ల‌పాటు దోబూచులాడుతూ స‌హ‌జీవ‌నం చేశారు. చాలా రోజుల పాటు వీళ్లు ర‌హ‌స్యంగా ఒకే ఇంటిలో ఉన్నారు. 2017 వీరిద్ద‌రు పెళ్లి చేసుకుని ఒక బిడ్డ‌కు త‌ల్లి తండ్రులు అయ్యారు. వీరిద్ద‌రు ఇండియాలోనే మోస్ట్ రొమాంటిక్ క‌పుల్‌గా ఉన్నారు.

నాగచైతన్య – సమంత :
నాగ‌చైత‌న్య- స‌మంత జంట కూడా పెళ్లికి ముందు ఒకే ఇంటిలో స‌హ‌జీవ‌నం చేసిన్నాటు క‌థ‌నాలు వ‌చ్చాయి. వీరిద్ద‌రు కాంబోలో వ‌చ్చిన తొలి సినిమా ఏం మాయ చేసావే, అటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం సినిమాల స‌మ‌యం నుంచే వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి పోయారు. ఒక‌సారి బాల్క‌నీలో ఈ జంట రొమాన్స్ చేసిన ఫోటోలు లీక్ అవ‌టం కూడా క‌ల‌క‌లం రేపిన‌ సంగ‌తి తేలిసిందే. అ త‌ర్వాత 2017 పెళ్ళి చేసుకున్న వీరిద్ద‌రు నాలుగేళ్ల‌ కాపురం త‌ర్వాత గ‌త ఏడాది విడిపోయిన సంగ‌తి తేలిసిందే.

బోనీక‌పూర్ – శ్రీదేవి:
శ్రీదేవితో ప్రేమ‌లో ప‌డ‌డానికి ముందే బోనీక‌పూర్ మోనా క‌పూర్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు తెలియ‌కుండా శ్రీదేవితో సిక్రెట్‌గా కాపురం పేట్టేశారు బోనీ. ఆ త‌ర్వాత మోనా, శ్రీదేవి జీవితాంతం స‌వ‌త‌లుగానే కొన‌సాగారు. మోనా కూమారుడు అర్జున్ క‌పూర్ కూడా శ్రీదేవితో అంత స‌ఖ్య‌త‌గా లేడ‌ని అంటారు. ఇలా వీరు మాత్ర‌మే కాదు ఎంతో మంది సినిమా, క్రికెట్ సెల‌బ్రిటీలు పెళ్ళికి ముందే ప్రేమించుకుని స‌హ‌జీవ‌నాలు చేసుకుని వార్త‌ల‌కు ఎక్కారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news