Moviesఆ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌ను న‌మ్మి నిండా మునిగిపోయిన మ‌హేష్‌...!

ఆ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్‌ను న‌మ్మి నిండా మునిగిపోయిన మ‌హేష్‌…!

టాలీవుడ్ లో స్టార్ హీరోలతో… సీనియర్ హీరోలతో పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీసి డిజాస్టర్లు ఇచ్చిన దర్శకుడు ఉన్నాడు. అసలు ఇప్పుడు ఆ దర్శకుడు పేరు చెపితేనే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అలాంటి దర్శకుడికి ఇప్పుడు ఏకంగా ఓ సీనియర్ హీరో సినిమా ఛాన్స్ ఇవ్వడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఆ స్టార్ హీరో అభిమానులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎక్కడో హిట్ అయిన సినిమాను ఐదేరేళ్లకు ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. అందులోనూ గత పది ఏళ్లలో భయంకరమైన ప్లాపులు ఇచ్చిన ఆ దర్శకుడు తప్ప తమ హీరోకు మరో దర్శకుడు దొరకలేదా ? అని వాపోతున్నారు.

ఆ దర్శకుడు కూడా గత ఏడ ఎనిమిది సంవత్సరాలగా ఖాళీగా ఉన్నాడు. అయితే మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబును పట్టేశాడు. ఓ పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు మహేష్ బాబు ఓ ప్రకటన చేసేలా ఒప్పించాడు. ఆ ప్రకటనను సదరు డిజాస్టర్ డైరెక్టర్ డైరెక్ట్‌ చేశాడు. మహేష్ బాబు స్వయంగా దానిని ప్రమోట్ చేయడంతో చాలామంది భారీ ఎత్తున ఆ సంస్థ‌లో పెట్టుబడులు పెట్టారట. అయితే ఇప్పుడు ఆ సంస్థ దివాలా తీసింది అని తెలుస్తోంది.

ఆ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారని సమాచారం. ఇప్పటికే సగం వరకు వచ్చిన ఆ ప్రాజెక్టును డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే ఆపేశారట. దీంతో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు.. డబ్బులు కట్టిన వాళ్ళు, బుకింగ్ అమౌంట్ కట్టిన వారు ఆ డబ్బులు వెనక్కు రాక బోరున వాపోతున్నట్టు తెలుస్తోంది.

ఏదేమైనా హీరోలు ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు వాస్తవాలు, ఆ సంస్థ యొక్క పరిస్థితి తెలుసుకుని ప్రకటనలు చేస్తే బాగుంటుంది. ఎక్కువ రమ్యునరేషన్ వస్తుందని.. ఇలాంటి ప్రకటనలు చేస్తే వాళ్ళ పరువు పోవడంతో పాటు వాళ్ళని చూసి పెట్టుబడులు పెట్టిన వారంతా నిండా మునిగి పోవాల్సిందే. అలాగే హీరో మ‌హేష్‌బాబుకు కూడా ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు చేస్తే మైన‌స్ అవుతుంది. ఇక‌పై అయినా మ‌హేష్ ఇలాంటి డైరెక్ట‌ర్లు, ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news