Moviesసినిమా హిట్ అయిన సంతోషం కన్నా..ఆ బాధే ఎక్కువ గా ఉంది..బిగ్...

సినిమా హిట్ అయిన సంతోషం కన్నా..ఆ బాధే ఎక్కువ గా ఉంది..బిగ్ షాకిచ్చిన అనుపమ..!!

కార్తికేయ 2 ..మువీ నే ఇప్పుడు అందరి నోట నానిపోతుంది. ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా..మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి..నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుంది. యంగ్ హీరో నిఖిల్ సిద్దర్థ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ సినిమాకి తీసిన సీక్వెల్ నే ఈ కార్తికేయ 2. ఆ సినిమాకి కొనసాగింపుగా తీసిన ..కధలో ట్వీస్ట్లు..విజువల్ ఎఫెక్ట్స్..జనాలకు బాగా నచ్చేసాయి.

దీంతో ఈ మూవీ కలెక్షన్ల విషయలో దూసుకుపోతుంది. అంతక ముందు వచ్చిన సినిమాలనీ తుడుచుపెట్టుకు పోయేలా చేసింది. సినిమా రిలీజ్ కి ముందు..నిఖిల్ మాట్లాడుతూ ..”నేను చిన్న హీరోని అని..నా సినిమా చాలా సార్లు వాయిదా వేయించారు..”అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అని మరోసారి ప్రూవ్ చేసాడు నిఖిల్. ఈసినిమా మన తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ నార్త్ అంతా పాజిటివ్ టాక్ వచ్చింది. అటు యూఎస్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

కాగా, ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సినిమా ఇంతటి పెద్ద విజయం అందుకుందని అందరు హ్యాపీగా ఉంటుంటే..ఆమె మాత్రం నాకు బాధ గా ఉంది అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. అను మాట్లాడుతూ,,” అందరు ఈ సినిమా సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ, నాకు చాలా బాధ గా ఉంది. ఈ సినిమా అప్పుడే అయిపోయిందా..ఇంక కార్తికేయ 2 తో నాకు రుణం తీరిపోయిందా అనే బాధే ఎక్కువ డామినేట్ చేస్తుంది..”అంటూ చెప్పుకొచ్చింది. దీంతో జనాలు తమ నోటికి పని చెప్పుతూ..అనుపమకు కౌంటర్లు వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news