Moviesసాయి పల్లవి చెత్త నిర్ణయం.. లేడి పవర్ స్టార్ ట్యాగ్ ఊడేలా...

సాయి పల్లవి చెత్త నిర్ణయం.. లేడి పవర్ స్టార్ ట్యాగ్ ఊడేలా ఉందే ..మరో షాక్ తప్పదా…?

యస్..ఇప్పుడు సినీ విశ్లేషకులు ఇదే మాట అంటున్నారు. తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న సాయి పల్లవి.. ముందు వెనుక ఆలోచించకుండా.. కేవలం కధ పై దృష్టి పెడుతుంది అంటూ మండిపడుతున్నారు. జనాలు సైతం సాయి పల్లవి తీసుకుంటున్న డెసీషన్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు,

ఇన్నాళ్లు సాయి పల్లవి ని ఆదరించిన జనం..ఇప్పుడు ఆమెలోని తప్పులను వెతకడానికి కారణం..ఆమె రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలే . రానా , సాయి పల్లవి హీరోయిన్లుగా నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ టైంలో..ఆమె కాశ్మీర్ పండిట్స్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున్న వైరల్ గా మారాయి. కొందరు జనాలు సాయి పల్లవికి అస్సలు బుద్ధి ఉందా..అంటూ మండిపడ్డారు.

సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా సాయి పల్లవి పై ఫైర్ అయ్యింది. ఈ మాటలే విరాటపర్వం మిక్స్డ్ టాక్ సంపాదించుకునేలా చేసింది. అయితే, ఇప్పుడు సాయి పల్లవి నటించిన మరో సినిమా “గార్గి” రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమాకి వీళ్ళు ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ఆ టైం కూడా లేదు. కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది.

సినిమాను 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల మొత్తం బాక్స్ ఆఫిస్ వద్ద వరుసగా సినిమాలు ఉన్నాయి. ఇది కూడా ఓ మైనస్ అనే చెప్పలి. పోనీలే ఆ తర్వాత రిలీజ్ చేద్దామంటే ..అయ్య బాబోయ్ ఆ తరువాత అన్నీ పెద్ద సినిమాలే ఉన్నాయి. ఎంత సాయి పల్లవి – స్టార్ అయినా ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ అంటే కొంచెం కష్టమే. తేడా కొడితే గ్యారెంటీగా సాయి పల్లవి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news