Moviesరష్మికను సాటిస్ఫై చేసిన ఆ డైరెక్టర్..బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా...

రష్మికను సాటిస్ఫై చేసిన ఆ డైరెక్టర్..బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన క్రష్మిక..?

కన్నడ బ్యూటీ రష్మీక మందన్నా..పేరు ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. వరుసగా భారీ సినిమాలకు సైన్ చేస్తున్న రష్మిక ఫాలోయింగ్ చూసి..మిగత హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారు. ఇలా అన్ని ప్రాజెక్ట్స్ ని ఎలా డీల్ చేయగల్గుతుంది.. అంటూ ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మడు బాలీవుడ్ పై మనసు పారేసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే నాలుగు ప్రాజెక్ట్లకి సీన్ చేసిన ఈ ముద్దుగుమ్మ..ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ని సైతం పట్టిన్నట్లు తెలుస్తుంది. అయితే, తాజాగా సొషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. చరణ్ సినిమా రష్మిక రిజెక్ట్ చేసిందట. అది కూడా బాలీవుడ్ హీరో కోసం. జనరల్ గా మెగాహీరో తో సినిమా అంటే..ఎగిరి గంతేస్తారు. కానీ, రష్మిక ఇలా చరణ్ లాంటి స్టార్ హీరో పక్కన సినిమా అవకాశం వస్తే..ఎందుకు రిజెక్ట్ చేసిందా అని చర్చించుకుంటున్నారు.

శంకర్-చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో కియారా, అంజలి హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ చిన్న రోల్ ఉందని..అది జర్నలిస్ట్ పాత్ర అని.. దాని కోసం రష్మికను సంప్రదించగా ..ఇన్నాళ్ళు రెమ్యూనరేషన్ పరంగా సాటిస్ఫై అవ్వని రష్మిక ఆ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టి..ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ సాటిస్ఫై అయ్యే ఆఫర్ ఇవ్వదంతో చరణ్ సినిమాని రిజెక్ట్ చేసిందంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ రష్మిక పై గుర్రుగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news