Moviesవారెవ్వా..మహేశ్ సినిమాలో అనసూయ..భలే ఆఫర్ పట్టేసిందే..?

వారెవ్వా..మహేశ్ సినిమాలో అనసూయ..భలే ఆఫర్ పట్టేసిందే..?

ఇండస్ట్రీలో అనసూయ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..ఆ తరువాత మెల్లగా మెల్లగా..యాంకరింగ్ మొదలు పెట్టి..తనలో టాలెంట్ ని బయటపెడుతూ..అందాలను చూయిస్తూ..జబర్ధస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ..ఇప్పుడు బుల్లితెర..వెండితెర పై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటి సంపాదించుకున్న ఈ బ్యూటీ..కి ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి.

ప్రజెంట్ నాలుగు సినిమాలు అనసూయ చేతిలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా. తాజాగా అమ్మడు ఖాతాలో మరో స్టార్ హీరో సినిమా వచ్చి చేరిన్నట్లు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో అనసూయ ఓ కీలక రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది. సెకండ్ హీరోయిన్ గా మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ కూడా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో అనసూయది ఫన్నీ రోల్ అని..మహేశ్ బాబుకి వదిన పాత్రలో అనసూయ నటిస్తుందని తెలుస్తుంది. మహేష్ అనసూయ మధ్య చాలా కామెడీ సీన్స్ ఉంటాయని..ఈ సినిమాలో మనం మరో కొత్త అనసూయని చూడబోతున్నాం అంటూ ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే..అనసూయ పుష్ప, రంగస్ధలం లాంటీ బిగ్ సినిమాల్లో నటించి..తనదైన స్టైల్ లొ అభిమానులను ఆకట్టుకుంది. చిరంజీవి సినిమాలోను అనసూయ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ..అనసూయా హీరోయిన్లకి సైతం గట్టిపోటీ ఇస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news