Moviesనయన్ ను కోడలిగా అంగీకరించడానికి విగ్నేశ్ అమ్మ పెట్టిన ఒక్కే ఒక్క...

నయన్ ను కోడలిగా అంగీకరించడానికి విగ్నేశ్ అమ్మ పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే..?

ఇన్నాళ్లు మిస్.నయనతార గా ఉన్న ఈ అమ్మడు ..మరి కొద్ది రోజుల్లో మిసెస్..విగ్నేశ్ శివన్ గా మారిపోబోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా లవ్ లో మునిగి తేలిన ఈ జంట ..ఇప్పుడు అఫిషియల్ భార్య భర్తలుగా మారబోతున్నారు. దీంతో కోలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది. విగ్నేశ్ శివన్ కన్నా..నయనతార కి చాలా క్రేజ్ ఉంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే. కోలీవుడ్ నెం 1 హీరోయిన్ ఈమె..అలాంటి హీరోయిన్ పెళ్లి జరగబోతుంది అంటే అభిమానులు ఊరుకుంటారా..ఫుల్ బిందాస్ రచ్చ షురూ చెయ్యడానికి సిద్ధమైయ్యారు.

ఇండస్ట్రీలో లేడీ అమితాబ్ అని పిలిపించుకునే నయనతారా మరి కొద్ది గంటల్లోనే పెళ్లి చేసుకోబోతుంది . జూన్ 9 న మహాబలిపురంలో ఈ జంట ఒక్కటి అవ్వబోతున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చిన నయనతార…అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికి ఆమెకు బడా బడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి . తెలుగు, తమిళం, హింది,మలయాళం..ఇలా అన్ని భాషల్లో అవకాసాలు వస్తున్నాయి.

కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..నయన్ ఇక సినిమాలు చేయదట. ఇప్పటి వరకు తాను కమిట్ అయిన సినిమాలు మాత్రమే చేస్తుందట. అంటే ఇక పై తెర పై నయన్ బొమ్మ కనిపించదు అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం తన కాబోయే భర్త విగ్నేశ్ శివన్ అమ్మగారు మీనా కుమారి ..తన ఇంటి కోడలిగా వచ్చాక ఓ పద్ధతి ఉందని..ఇలా మొహానికి రంగులు పూసుకుని..నటించడం..వాళ్ల ఇళ్లల్లో నచ్చదని చెప్పారట.

అందుకే నయన్ ను పెళ్ళి తరువాత సినిమాలు మానేయమనే కండీషన్ పెట్టి..ఈ పెళ్ళికి ఒప్పుకున్నారట. ఆశ్చర్య ఏమిటంటే, నయన్ ఈ కండీషన్ కు ఒకే చెప్పిందట. పెళ్ళి తరువాత నిర్మాణ రంగం వైపు ఉంటానే కానీ, సినిమాల జోలికి వెళ్లను అని మాట ఇచ్చిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news