Moviesఆ ఒక్క రీజన్ తోనే పిల్లని ఇవ్వడానికి వెనకడుగువేశారు..నాని సంచలన కామెంట్స్..!!

ఆ ఒక్క రీజన్ తోనే పిల్లని ఇవ్వడానికి వెనకడుగువేశారు..నాని సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాని గురించి పెద్దగా పరిచయం చెయాల్సిన అవసరం లేదు. కెరీర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఈయన ..ఆ తరువాత అష్టా చెమ్మా..అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతోనే నాచుర‌ల్ స్టార్ అని బిరుదుని అందుకున్నాడు. ఆ తరువాత నాని రేంజ్ మారిపోయింది. వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు. ఒకానోక సమయంలో పెద్ద హీరోల సినిమాలకి కూడా నాని సినిమాలు గట్టి కాంపిటీషన్ ఇచ్చాయి. హ్యాట్రిక్ హిట్లు కొట్టి స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోయాడు నాని.

కానీ, ఆ తరువాత నాని టైం బ్యాడ్ అయ్యింది వి – ట‌క్ జ‌గ‌దీష్ సినిమాల‌ను క‌రోనా టైంలో ఓటీటీలో రిలీజ్ చేసి రిస్క్ చేశాడు నాని. భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. కాగా, నాని గ‌తేడాది చివ‌ర్లో శ్యామ్‌సింగ‌రాయ్ సినిమాతో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి..మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా వ‌చ్చాయి. ప్రజెంట్ నాని అంటే సుందరానికి చిత్రం ద్వారా మరోబ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాలో మలయాళు బ్యూటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేయడంతో సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే నాని మీడియాతో ముచ్చటించారు. మీడియాతో నాని మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే సినిమాలో ఇంటర్ క్యాస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్‌స్ ..ఆ టైంలో పేరంట్స్ ఎలా రియాక్ట్ అవుతారో మంచి కామెడి టైమింగ్ తో ఉంటాయని చెప్పుకొచ్చారు నాని.

అప్పుడే రిపోర్టర్ నాని మ్యారిడ్ లైఫ్ గురించి ప్రశ్నించగా ..”నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాదు. కానీ, మా పెళ్లి టైంలో అంజు వాళ్ళ పేరంట్స్ నాకు తనని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి బాగా ఆలోచించారు. ఆసమయంలో నేను హీరోగా స్ట్రగులింగ్‌లో ఉన్నాను. దీంతో వాళ్లు నాకు అంజు ని ఇవ్వాలా వద్దా అని ఆలోచించి..చాలా టెన్షన్‌ పడ్డారట. అయితే, నన్ను డైరెక్ట్ గా మీట్ అయ్యి నాతో మాట్లాడిన తరువాత వెంటనే పెళ్లికి ఒప్పుకునేశారు”అంటూ చెప్పుకొచ్చాడు నాని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news