Moviesఆ స్టార్ క్రికెట‌ర్‌తో ' ప్రియాంక జ‌వాల్క‌ర్ ' ప్రేమాయ‌ణం... పెద్ద...

ఆ స్టార్ క్రికెట‌ర్‌తో ‘ ప్రియాంక జ‌వాల్క‌ర్ ‘ ప్రేమాయ‌ణం… పెద్ద క‌థే న‌డుస్తోందే..!

అచ్చ తెలుగు అమ్మ‌యి అనంత‌పురం అమ్మాయి అయిన ప్రియాంక జ‌వాల్క‌ర్ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా కూడా ఆమెకు ఉన్న క్రేజ్ ఎక్కువే. ఆమె లుక్స్‌, స్టైల్‌తోనే యూత్‌ను ప‌డేసింది. టాక్సీవాలా సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన ఈ అమ్మ‌డు తొలి సినిమా ఫంక్ష‌న్‌లోనే త‌న‌కు అల్లు అర్జున్ అంటే క్ర‌ష్ అని చెప్పేసి పెద్ద సంచ‌ల‌న‌మే రేపింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఆమె సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది.

చూడ‌డానికి కావాల్సినంత అందం.. కైపైక్కించే క‌ళ్లు… క్యూట్ లుక్స్ ఇవ‌న్నీ ప్రియాంక సొంతం. ట్యాక్సీవాలా త‌ర్వాత తిమ్మ‌రుసు, ఎస్ఆర్ క‌ళ్యాణమండ‌పం లాంటి హిట్ సినిమాలు కూడా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు ప్రియాంక జ‌వాల్క‌ర్ ప్రేమాయ‌ణం గురించిన వార్త నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.

ఆమె ఏకంగా ఓ స్టార్ క్రికెట‌ర్‌నే బుట్ట‌లో వేసుకుని ఎఫైర్ పెట్టుకుంద‌ట‌. ఆ స్టార్ క్రికెట‌ర్ ఎవ్వ‌రో కాదు వెంక‌టేష్ అయ్య‌ర్‌. మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు హీరోయిన్ల‌తో ఎఫైర్లు, పెళ్లిళ్లు అనేది ఇప్ప‌టి నుంచే కాదు ఎప్ప‌టి నుంచో ఉంది. ఎంతోమంది బాలీవుడ్ హీరోయిన్లు, ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌తో ఎఫైర్లు పెట్టుకోవ‌డంతో పాటు వాళ్ల‌ను పెళ్లి కూడా చేసుకున్నారు.

ర‌విశాస్త్రి – అమృతాసింగ్ ఎఫైర్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం. జ‌డేజా – మాధురి దీక్షిత్‌, అజారుద్దీన్ – నౌరీన్‌, కోహ్లీ – అనుష్క‌శ‌ర్మ ఇలా జంట‌ల క‌థ‌లే మ‌నం చూశాం. ఇప్పుడు ఈ లిస్టులోనే ప్రియాంక – వెంక‌టేష్ అయ్య‌ర్ చేరిపోయారు. ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రే క‌నిపిస్తున్నార‌ట‌. కొద్ది రోజుల క్రితం ప్రియంక ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోకు వెంక‌టేష్ అయ్య‌ర్ కామెంట్ చేయ‌గా.. ఆ కామెంట్‌కు ప్రియాంక జ‌వాల్క‌ర్ స్వీట్‌గా రిప్లై ఇచ్చింది.

అప్ప‌టి నుంచి వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌న్న వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. దీనికి తోడు ఎక్క‌డ చూసినా వీరిద్ద‌రు క‌నిపిస్తున్నారు. తాజాగా ప్రియాంక త‌న ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తిని బ్యాక్ వైపు నుంచి చూపిస్తూ అత‌డే అంటూ హార్ట్ ఎమోజీ షేర్ చేసింది. దీంతో నెటిజ‌న్లు ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు వెంక‌టేష్ అయ్య‌రే అంటూ కామెంట్లు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకుంటార‌న్న ప్ర‌చారం కూడా గ‌ట్టిగానే జ‌రుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news