Moviesసుకుమార్ మాట తప్పాడు..బన్ని ఫ్యాన్స్ ఫైర్..?

సుకుమార్ మాట తప్పాడు..బన్ని ఫ్యాన్స్ ఫైర్..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కానీ..వాళ్ళందరిలోకి సుకుమార్ డైరెక్షన్ స్టైల్ కొత్తగా ఉంటుంది. చూడటానికి ఫ్రెష్ లుక్స్ లో..వెరైటీ గా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏ సినిమా చేసినా అందులో ఓ సరికొత్త పాయింట్ ని ఎలివేట్ చేస్తూ..సినిమా కే కొత్త అందం తీసుకొస్తారు సుకుమార్. మన ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కూడా సుకుమార్ డైరెక్షన్ స్టైల్ ని ఇష్టపడుతారు. చిరంజీవి డైరెక్ట్ గా నే సుకుమార్ దర్శకత్వం గురించి ఓ రేంజ్ పొగిడేసిన సంధర్భాలు ఉన్నాయి.

ఇక గతేడాది వచ్చిన “పుష్ప” సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. ఓ స్టార్ హీరో ఎర్ర చందనం స్మగ్లర్ గా మార్చేసి.. ఆ స్టోరీ కి హీరోయిన్ ని లింక్ చేస్తూ..రొమాన్స్ పండించిన డైరెక్టర్ సుకుమార్.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేనా..పాన్ ఇండియా స్దాయిలో గుర్తింపు తెచ్చుకుని..ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోల కళ్లు కూడా తన పై పడేలా చేసుకున్నాడు.

అయితే, పుష్ప పార్ట్ 2 సినిమా విషయంలో ఎందుకో సుక్కు లేట్ చేస్తున్నాడు. నిజానికి సుకుమార్ చెప్పిన మాట ప్రకారం అయితే..పుష్ప 1 రిలీజ్ డేట్ రోజే పుష్ప 2 కూడా రిలీజ్ చెయ్యాలి..కానీ, ఇప్పటి వరకు షూట్ పనులే మొదలు పెట్టలేదు..మరి డిసెంబరు 17న నాటికి సినిమాని ఎలా కంప్లీట్ చేస్తారు.

అది అసాధ్యం..అంటే, పుష్ప 2 ఇక సంక్రాంతి లిస్ట్ లోకి చేరబోతుంది. అయితే, పుష్ప 1 తరువాత బన్నీ ఇంత గ్యాప్ తీసుకోవడం పట్ల ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు. తొందరగా సినిమాని సెట్స్ పైకి తీసుకురా సామీ..అంటూ మండిపడుతున్నారు. మరి చూడాలి సుక్కు ఏం చేస్తాడో

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news