Moviesప్రశాంత్ నీల్ కి ఆ పిచ్చి ఉందా..హాట్ రూమర్ తో కొత్త...

ప్రశాంత్ నీల్ కి ఆ పిచ్చి ఉందా..హాట్ రూమర్ తో కొత్త చిక్కులు..?

ప్రశాంత్ నీల్ ఒకప్పుడు ఈ పేరు పెద్ద గా అందరికి తెలియక పోవచ్చు. కానీ, KGF సిరీస్ తరువాత ప్రపంచ దేశాలకు ఈయనలోని టాలెంట్ పరిచయమైంది. అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అంటారు. ఆ విషయంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. కేవలం ఒక్క KGF1,2 సినిమాలతోనే ..దర్శకధీరుడు రాజమౌళి లాంటి..స్టార్ డైరెక్టర్ల పక్కన చోటు కొట్టేశాడు. మనకు తెలిసిందే..ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు ఎవరయ్యా అంటే..ఖచ్చితంగా రాజమౌళి, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపిస్తాయి.

అంత లా పాపులర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అయితే, ప్రజెంట్ ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ఈయన..ఆ తరువాత తారక్ తో ఓ మాస్ సినిమా తీయ్యబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన..రీసెంట్ గానే అఫిషీయల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ తోనే సినిమా పై బోలెడు అంచానలను పెట్టుకునే లా చేశాడు ప్రశాంత్ నీల్. అయితే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ కు సంబంధించిన హాట్ మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రశాంత్ నీల్ సినిమాలొ కామన్ గా కనిపిస్తున్న పాయింట్ “కోల్..బొగ్గు”. KGF1 అండ్ KGF2 అయితే..ఓకే..ఆ కాన్సెప్ట్ తో స్టోరీ రాసుకున్నారు..అలాగే..లమిట్ అయ్యాడు. అయితే, సలార్ సినిమాలోను ప్రభాస్ మాస్ లుక్స్ కనిపిస్తూ..ఒంటికి బొగ్గు పూసుకుని..ఆ లుక్స్ లోనే దర్శనమిచ్చాడు ప్రభాస్.

అంతేనా, రీసెంట్ గా రిలీక్ అయిన తారక్ సినిమా లుక్స్ లోను అదే మాస్ మ్యానరిజం ని హైలెట్ చేశాడు ప్రశాంత్ నీల్. ఒక్కవేళ్ళ స్టోరీ బొగ్గు గురించే అయితే..ఖచ్చితంగా ప్రాశాంత్ మీద ఓ నెగిటీవ్ ఇంప్రేషన్ పడే ఛాన్స్ లు ఉన్నాయి. కొందరు ప్రశాంత్ యాంటీ బ్యాచ్ అయితే..ఆయనకి బొగ్గు తప్పిస్తే కళ్లకి ఏం కనిపించదని..సెటైర్స్ వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న ప్రశాంత్ పై ఇలాంటి కామెంట్స్..కొంచెం ఆలొచించేలా నే చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news