Movies46 ఏళ్ల మ‌హేష్‌బాబు చెక్కు చెద‌ర‌ని అందం సీక్రెట్ ఇదే..!

46 ఏళ్ల మ‌హేష్‌బాబు చెక్కు చెద‌ర‌ని అందం సీక్రెట్ ఇదే..!

సినిమా హీరోలు అంటేనే 60 +లో ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ అదిరిపోతారు. హీరోల‌కు లైఫ్ స్పాన్ ఎక్కువ‌. అందుకే వాళ్లు ఆరు ప‌దుల వ‌య‌స్సు దాటినాకూడా అందంగానే క‌నిపించాలి. లేక‌పోతే ప్రేక్ష‌కులు వారిని చూడ‌రు. అదే హీరోయిన్లు కొంత కాలం వ‌ర‌కు అంటే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సు వ‌ర‌కు అందాన్ని బాగానే మెయింటైన్ చేస్తారు. త‌ర్వాత వారు అందాన్ని కాపాడుకోవ‌డం క‌ష్టం. పెరిగిన వ‌య‌స్సు దాచుకోలేరు. వారీ శరీర ఆకృతిలో ప‌లు మార్పులు వ‌చ్చేస్తాయి.

అయితే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు అందం వేరు. వ‌య‌స్సు 46కు చేరువ అయినా .. మ‌హేష్ ఇప్ప‌ట‌కీ రాజ‌కుమారుడు లాగానే క‌నిపిస్తాడు. తాజాగా స‌ర్కారు వారి పాట ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం మ‌హేష్ న్యూ ఛార్మింగ్‌తో క‌నిపించాడు. చాలా మంది హీరోలు సినిమాల్లో సీజీ వ‌ర్క్‌తో మేనేజ్ చేసుకుంటూ వ‌స్తున్నా కూడా మ‌హేష్ ఈ రోజుల్లో ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నాడురా బాబు అని చాలా మందికి జ‌ల‌సీ కూడా వ‌చ్చేస్తుంది.

46 ఏళ్ల వ‌య‌స్సులో మ‌హేష్‌కు గుప్పెడు పొట్ట కూడా లేదు. హెయిర్ చెక్కు చెద‌ర్లేదు. ఫేస్ న‌వ య‌వ్వ‌నంతో తొణికిస‌లాడుతున్న‌ట్టే ఉంటుంది. తాజాగా స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్లో వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ వేస్తాడు. ఊరుకోండి సార్ మీకేంటి పెళ్లి అప్పుడే .. చిన్న‌పిల్లాడు అయితేనే అంటాడు. వెంట‌నే మ‌హేష్ మెయింటైన్ చేయ‌లేక దూల‌తీరిపోతోంద‌ని ఫేస్‌పై కీర‌దోస ముక్క‌లు పెట్టుకుని పొడుకుంటాడు.

త‌న అందం కాపాడుకోవ‌డానికి మ‌హేష్ రియ‌ల్ లైఫ్ లో కూడా ఇలాంటి వ‌ర్క‌వుట్లు చాలానే చేస్తాడ‌ట‌. ఫిజిక్‌, గ్లామ‌ర్ మెయింటైన్ చేసేందుకు మ‌హేష్ ప‌డే క‌ష్టం బ‌య‌ట‌కు పెద్ద‌గా తెలియ‌దు..కానీ అత‌డితో ప‌నిచేసే ద‌ర్శ‌కులే ఆ విష‌యం చెపుతూ ఉంటారు. చివ‌ర‌కు మ‌హేష్ త‌న‌తో ప‌నిచేసే ద‌ర్శ‌కుల‌ను కూడా స్లిమ్‌గా మార్చేస్తాడ‌ని అంటారు. మ‌హ‌ర్షి టైంలో వంశీ పైడిప‌ల్లి, ఇప్పుడు ప‌ర‌శురాం కూడా చాలా స్లిమ్ అయిపోయారు.

ఏ రోజు ఎంత తినాలి ? ఏం తినాలి అనే డైట్ మెనూ మ‌హేష్ చాలా సీరియ‌స్‌గా ఫాలో అవుతూ ఉంటాడ‌ట‌. మ‌హేష్ తినే ఆహారం మ‌నం అస్స‌లు తిన‌లేం అని ఆయ‌న‌తో ప‌ని చేసే ఎంతో మంది ఓపెన్‌గానే చెప్పేస్తూ ఉంటారు. అసలు అందులో చాలా వ‌ర‌కు ఉప్పు , కారం లేకుండా ఉంటాయ‌ట‌. ఎప్పుడు అయినా వారానికి ఓ రోజు న‌చ్చిన ఆహార ప‌దార్థాలుతిన్నా మ‌రుస‌టి రోజు నుంచి ఆయ‌న డైట్ మెనూ ఫాలో అయిపోవాల్సిందే అట‌.

ఇక జిమ్ విష‌యంలో కూడా మ‌హేష్ ఒకే టైప్ వ్యాయామాలు చేయ‌కుండా.. త‌ర‌చూ ప్యాట్ర‌న్ మారుస్తూ ఉంటాడ‌ట‌. త‌న రెగ్యుల‌ర్ జిమ్ తో పాటు సినిమా స్టైల్‌కు అనుగుణంగా ఆ జిమ్ విన్యాసాలు మారుతూ ఉంటాయ‌ట‌. ఈ క‌ష్టంతోనే మ‌హేష్ ఈ ఏజ్ గ్రూప్ హీరోల్లో ఎవ్వ‌రికి లేనంత అద్భుత‌మైన అందం సొంతం చేసుకున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news