Moviesకేకో కేక‌: ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా రిలీజ్ టైం...

కేకో కేక‌: ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా రిలీజ్ టైం వ‌చ్చేసింది…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయ‌న అభిమానులు కూడా గ‌త 20 ఏళ్ల‌లో ఎప్పుడూ లేనంత జోష్‌తో ఉన్నారు. 2015 టెంప‌ర్ నుంచి ఎన్టీఆర్ గుడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఈ ఏడేళ్ల‌లో ఆరు సినిమాలు చేసి ఆరు సినిమాల‌తో హిట్లు కొట్టాడు ఎన్టీఆర్‌. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఏ హీరోకు లేన‌ట్టుగా ఒక్క తార‌క్‌కు మాత్ర‌మే డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు ఉన్నాయి.

టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ – తాజాగా త్రిబుల్ ఆర్‌.. ఈ 6 సినిమాలు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. త్రిబుల్ ఆర్‌తో వ‌చ్చిన పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేయాల‌ని చూస్తున్నాడు ఎన్టీఆర్‌. ఈ క్ర‌మంలోనే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా క‌థ కూడా పాన్ ఇండియా లెవ‌ల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

కొర‌టాల శివ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ అభిమానుల దృష్టంతా కేజీయ‌ఫ్‌, స‌లార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించే సినిమా మీదే ఉంది. ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ ఓ భారీ యాక్ష‌న్ డ్రామా ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్‌తో తీస్తోన్న స‌లార్ త‌ర్వాతే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ రూమ‌ర్ బ‌య‌ట‌కు వినిపిస్తోంది. ఈ సినిమాను ద‌స‌రాకు లాంచ్ చేస్తార‌ట‌. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2024 ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇంకా రెండున్న‌ర సంవ‌త్స‌రాల టైం ఉంది. కొర‌టాల శివ సినిమా ఎలాగూ ఈ యేడాది చివ‌ర్లో పూర్త‌వుతుంది.

అంటే 2023 నుంచి ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుంద‌ని అనుకున్నా యేడాదిన్న‌ర పాటు అదే సినిమాకు తార‌క్ వ‌ర్క్ చేస్తాడా ? లేదా మ‌ధ్య‌లో మ‌రో సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొంటాడా ? అన్న‌ది మాత్రం చూడాలి. ఏదేమైనా ఎన్టీఆర్‌ను తిరుగులేని పాన్ ఇండియా హీరోగా ప్ర‌శాంత్ నీల్ ఎలా ప్ర‌జెంట్ చేస్తాడా ? అన్న‌ది మాత్రం చాలా ఆస‌క్తిక‌ర‌మే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news