Moviesఅత‌డి ప‌క్క‌న‌ హీరోయిన్‌గానా... సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టి కాల్షీట్లు క్యాన్సిల్ చేయించిందెవ‌రు..!

అత‌డి ప‌క్క‌న‌ హీరోయిన్‌గానా… సౌంద‌ర్య‌ను భ‌య‌పెట్టి కాల్షీట్లు క్యాన్సిల్ చేయించిందెవ‌రు..!

దివంగ‌త మ‌హాన‌టి సౌంద‌ర్య గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సావిత్రి త‌ర్వాత అంత‌టి అభిన‌యం ఉన్న గొప్ప‌న‌టిగా పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకుంది. సౌంద‌ర్య క‌న్నడ అమ్మాయి అయినా కూడా ఆమెను మ‌న తెలుగు వాళ్లు త‌మ తెలుగింటి ఆడ‌బిడ్డ‌గా ఆద‌రించేశారు. సౌంద‌ర్య అచ్చ తెలుగు అమ్మాయే అని మ‌న‌వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఎస్వీ. కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌లీల సినిమా టాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమాలో ఆలీని హీరోగా ఎంపిక చేసిన‌ప్పుడే అంద‌రి షాక్ అయ్యారు.

అప్ప‌టికే ఎస్వీ. కృష్ణారెడ్డి వ‌రుస హిట్ల‌తో ఫామ్‌లో ఉండ‌డంతో పాటు సూప‌ర్‌స్టార్ కృష్ణ‌తో సినిమా చేస్తున్నారు. కృష్ణ సినిమా త‌ర్వాత ఎవ‌రితో చేయాల‌న్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న తీసుకున్న య‌మ‌లోకం కాన్సెఫ్ట్ క‌థ‌కు కృష్ణారెడ్డి మాత్రం ముందుగా ఆలీ పేరే చెప్పారు. అయితే నిర్మాత‌లు మాత్రం ఆలీతో సినిమా చేస్తే ఎవ‌రు చూస్తారు ? అస‌లు బిజినెస్ జ‌రుగుతుందా ? అని సందేహించారు. అయితే కృష్ణారెడ్డి మీద ఉన్న న‌మ్మ‌కంతో వారు నో చెప్ప‌లేదు.

ఇక హీరోయిన్ ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి మైండ్‌లో సౌంద‌ర్య పేరు మెదిలింది. అప్ప‌టికే సౌంద‌ర్య కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లో మూడు సినిమాలు చేయ‌డంతో ఆమెను ఏకగ్రీవంగా ఓకే చేసేశారు. సౌంద‌ర్య‌కు క‌థ చెప్ప‌గా బాగుంద‌ని ఓకే చెప్ప‌డంతో పాటు హీరో ఎవ‌రు ? అని అడిగింది. ఆలీ అన‌గానే ఆమె న‌వ్వేసి ఓకే చెప్పేసింది. హీరో, హీరోయిన్లు ఫిక్స్ అయిపోవ‌డంతో య‌ముడు, ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక‌లో బిజీ అయిపోయారు కృష్ణారెడ్డి.. అచ్చిరెడ్డి.

అయితే సౌంద‌ర్య ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. సౌంద‌ర్య‌కు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాత‌లు ఆమెను క‌లిసి మీరు ఆలీ ప‌క్క‌న హీరోయిన్‌గా చేస్తే మీ మార్కెట్ ప‌డిపోతుంది.. త‌ర్వాత మీ సినిమాలు ఎవ్వ‌రూ చూడ‌రు.. హీరోయిన్‌గా మీ గ్రాఫ్ ప‌డిపోయి మీ కెరీర్ క్లోజ్ అయిపోతుంద‌ని భ‌య‌పెట్టారు. ఇటు చూస్తే సౌంద‌ర్య కృష్ణారెడ్డికి మాట ఇచ్చేసి ఉంది. దీంతో ఆమె ఏం చేయాలో తెలియ‌క టెన్ష‌న్ పెట్టేసుకోవ‌డంతో ఆమెకు జ్వ‌రం వ‌చ్చేసింది.

అయితే సౌంద‌ర్య తండ్రి స‌త్య‌నారాయ‌ణ‌మాత్రం ఆమెకు జ్వ‌రం వ‌చ్చేసింద‌ని.. భ‌య‌ప‌డుతోందంటూ కృష్ణారెడ్డికి చెప్పారు. వెంట‌నే కృష్ణారెడ్డి సౌంద‌ర్య‌ను క‌లిసి ఈ క‌థ‌కు మ‌రో హీరోయిన్ అయితే బాగుంటుంద‌ని అనుకుంటున్నామ‌ని కూల్‌గా చెప్పేసి ఆమెను త‌ప్పించేశారు. ఆ త‌ర్వాత ఇంద్ర‌జ‌ను ఎంపిక చేసుకున్నారు. అలా హీరోయిన్ గా ఇంద్రజ అనుకోకుండా ప్రాజెక్టులోకి ఎంటర్ కావడంతో పాటు ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news