Movies' స‌ర్కారు వారి పాట ' కు డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌......

‘ స‌ర్కారు వారి పాట ‘ కు డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌… ఫ‌స్టాఫ్ అమెరికా… సెకండాఫ్ ఇండియా…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న స‌ర్కారు వారి పాట సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో సినిమాపై మామూలుగా అంచ‌నాలు లేవు. దీనికి తోడు స్టిల్స్‌, ట్రైల‌ర్ల‌తో సినిమాకు హిట్ క‌ళ ముందే క‌న‌ప‌డుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ల‌వ‌ర్స్ అంద‌రూ కూడా పోటీప‌డి ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రీ బుకింగ్స్‌లో స‌ర్కారు వారి పాట దుమ్ము రేపుతోంది.

ఇక ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది. దుబాయ్ సెన్సార్ బోర్డు స‌భ్యుడు అయిన ఉమైర్ సంధు ఈ సినిమా ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేశాడు. సినిమాలో మ‌హేష్ న‌ట‌న ఓ రేంజ్‌లో ఉంద‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన మ‌హేష్ సినిమాల్లో ఇది ది బెస్ట్ అని చెప్పాడు. సినిమాలో మ‌హేష్ సింహంలా గ‌ర్జించాడు అని.. మ‌హేష్ తెర‌మీద క‌నిపించిన ప్ర‌తిసారి అత‌డి కోపం తెర‌ను కాల్చేసిన‌ట్టే ఉంద‌ని ఆకాశానికి ఎత్తేశాడు.

సినిమాకు ప‌వ‌ర్ ఫుల్ మ‌హేష్‌బాబే.. సినిమా అంతా మ‌హేష్ భుజ‌స్కంధాల మీదే న‌డుస్తుంది.. మాస్ ప్రేక్ష‌కుల కోసమే తీసిన సినిమా ఇది అనిపిస్తుంద‌ని ఉమైర్ చెప్పాడు. సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ చాలా అందంగా క‌నిపించింది అని.. ఆమె న‌ట‌న చాలా బాగుంద‌ని.. మ‌హేష్‌బాబుతో ఆమె కెమిస్ట్రీ అదిరిపోయింద‌ని చెప్పాడు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము రేపుతోంద‌ని.. అది మ‌హేష్‌బాబు ప‌వ‌ర్ అని చెప్పాడు.

ఇక ఈ సినిమాను హిందీ, ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ చేసి ఉంటే పుష్ప‌, కేజీయ‌ఫ్ 2 లాగా బిగ్గెస్ట్ హిట్ అయ్యేద‌ని చెప్ప‌కొచ్చాడు. ఉమైర్ సంధు రివ్యూతో పాటు ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నిషీయ‌న్ల ద్వారా కూడా స‌ర్కారు వారి పాట అదిరిపోయింద‌న్న టాక్ ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఫ‌స్టాఫ్ అంతా అమెరికా నేప‌థ్యంలో న‌డుస్తుంద‌ట‌.

అమెరికాలో కీర్తి సురేష్‌, మ‌హేష్‌బాబు మ‌ధ్య వ‌చ్చే లవ్ ట్రాక్‌.. వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంద‌ని అంటున్నారు. 45 నిమిషాల పాటు వ‌చ్చే మ‌హేష్ – కీర్తి కెమిస్ట్రీ ఎపిసోడ్‌.. మ‌ధ్య‌లో వెన్నెల కిషోర్ చ‌మ‌క్కుల‌తో అస‌లు ప్రేక్ష‌కులు మామూలుగా ఎంజాయ్ చేయ‌ర‌ని అంటున్నారు. మ‌రి స‌ర్కారు వారి పాట రేంజ్ ఎలా ఉంటుందో ? మ‌రి కొద్ది గంట్ల‌లో తేలిపోనుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news