Moviesముద్దు సీన్లో నిజంగానే హీరో - హీరోయిన్లు నిజంగానే కానిచ్చారు ......

ముద్దు సీన్లో నిజంగానే హీరో – హీరోయిన్లు నిజంగానే కానిచ్చారు … త‌ట్టుకోలేక‌పోయార‌ట‌…!

బాలీవుడ్ వాళ్లు త‌మ సెక్సువ‌ల్ రిలేష‌న్స్ గురించి ఓపెన్‌గానే మాట్లాడేస్తూ ఉంటారు. పైగా ఇటీవ‌ల అనేక టాక్ షోల్లో సెల‌బ్రిటీలు ఎఫైర్లు, సెక్సువ‌ల్ రిలేష‌న్స్ గురించి మ‌రీ రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్‌లో కామ‌న్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సినిమాల్లో రొమాంటిక్ సీన్లు షూట్ చేసిన‌ప్పుడు తాము ఎలా స్పందించామో చెప్పేంత వ‌ర‌కు వ‌చ్చేశారు.

ఈ నేప‌థ్యంలో న‌టుడు ర‌ణ‌వీర్‌సింగ్ ఎప్పుడో వ‌చ్చిన సినిమాలో త‌న భార్య దీపికా ప‌దుకొనేతో తాను న‌టించిన ముద్దు సీన్ల గురించి సంచ‌ల‌నాత్మ‌క రీతిలో ఓపెన్ అయ్యాడు. పెళ్లికి ముందే ర‌ణ‌వీర్‌- దీపిక కాంబినేష‌న్ హిట్ కాంబినేష‌న్‌. ఈ క్ర‌మంలోనే వీరు ప్రేమ‌లో ప‌డి చివ‌ర‌కు పెళ్లి చేసుకుని నిజ జీవిత దంప‌తులు అయ్యారు.

వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సినిమాల్లో రామ్‌లీల ఒక‌టి. ఆ సినిమా షూటింగ్ టైంలో వీరి మ‌ధ్య శృంగార సీన్ల‌కు కొద‌వ లేదు. ఆ సినిమా విజ‌యంలో శృంగార సీన్లు కీల‌క పాత్ర పోషించాయి. ఇద్ద‌రూ కూడా ఘాటైన శృంగార సీన్ల‌తో పాటు లిప్‌కిస్ సీన్ల‌లో రెచ్చిపోయారు. ఈ సీన్లు షూట్ చేస్తున్న‌ప్పుడు త‌మ ఇద్ద‌రి ప‌రిస్థితి గురించి ర‌ణ‌వీర్ తాజా ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

ఈ సీన్ల‌లో తాము త‌మ‌ను అస్స‌లు కంట్రోల్ చేసుకోలేక పోయామ‌ని.. అప్ప‌టికే త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ప్రేమ ఎఫెక్ష‌నో లేదా మ‌రో కార‌ణ‌మో కాని… ఆ లిప్ కిస్ సీన్ల‌లో ఘాటుగా ముద్దులు పెట్టేసుకుంటూ తాము జీవించేశామ‌ని చెప్పాడు. చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు క‌ట్ చెప్పిన త‌ర్వాత కూడా తాము ముద్దు పెట్టుకోవ‌డం ఆప‌లేక‌పోయామ‌ని చెప్పాడు.

ర‌ణ‌వీర్ సినిమాకు ఈ సీన్లు చాలా హైలెట్ అయ్యాయి. దీనిని బ‌ట్టే వీరు ఎంత‌లా ప్రేమ‌లో మునిగి తేలారో అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత వీరు ప్రేమ‌లో మునిగి తేలారు. ఇప్పుడు వీరి ముద్దుల‌కు క‌ట్ చెప్పే వారు కూడా ఉండ‌రు క‌దా…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news