Moviesతార‌క్ లేడీ డైరెక్ట‌ర్ నందినీరెడ్డిని అలా పిలుస్తాడా... వైర‌ల్ కామెంట్స్‌...!

తార‌క్ లేడీ డైరెక్ట‌ర్ నందినీరెడ్డిని అలా పిలుస్తాడా… వైర‌ల్ కామెంట్స్‌…!

టాలీవుడ్‌లో లేడీ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌ప్పుడు మ‌హాన‌టి సావిత్రి, విజ‌య‌నిర్మ‌ల ఉండేవారు. ఆ త‌ర్వాత త‌రంలో లేడీ డైరెక్ట‌ర్ల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. ఇక ఇప్పుడు నందినీరెడ్డి – సుధ కొంగ‌ర లాంటి వాళ్లు స్టార్ల‌ను కూడా డైరెక్ట్ చేస్తూ త‌మ స‌త్తా చాటుతున్నారు. నందినీరెడ్డి డైరెక్ట‌ర్ అయ్యి ప‌దేళ్లు దాటేసింది. ఆమె కెరీర్‌లో చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి సినిమాలే ప‌డ్డాయి.

నాని – నిత్యా మీన‌న్ హీరో, హీరోయిన్లుగా వ‌చ్చిన అలా మొద‌లైంది సినిమాతో నందినీరెడ్డి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అయ్యింది. తొలి సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ద‌ర్శ‌కురాలిగా ఆమెకు మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత మ‌ధ్య‌లో ప్లాపులు వ‌చ్చి రేసులో కాస్త వెన‌క‌ప‌డినా.. తాజాగా ఓ బేబీ సినిమాతో ఆమె ద‌ర్శ‌కురాలిగా మ‌రో మెట్టు పైకి ఎక్కారు.

 

తాజాగా ఆమె ద‌ర్శ‌క‌త్వంలో అన్నీమంచి శ‌కున‌ములే సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే పూర్త‌వుతోంద‌ని… తాను అనుకోకుండా సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాన‌ని నంద‌ని చెప్పింది. నాకు టీచింగ్, మ్యాథ్స్ అంటే ఇష్టం లేద‌ని.. డాక్ట‌ర్ కావాల‌ని అనుకుని.. అనుకోకుండా పొలిటిక‌ల్ సైన్స్ తీసుకుని కోఠి ఉమెన్స్ కాలేజ్‌లో చ‌దువుకున్నాన‌ని చెప్పింది. ఆ త‌ర్వాత ఢిల్లీలోని జేఎన్‌యూలో చ‌దివాన‌ని కూడా చెప్పింది.

అనంత‌రం గుణ్ణం గంగ‌రాజు ద‌గ్గ‌ర లిటిల్ సోల్జ‌ర్స్ సినిమాకు ప‌నిచేశాన‌ని.. నాన్న సీఏగా ప‌ని చేసేవార‌ని… నాకు 3 ఏళ్ల ఏజ్ ఉన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు విడిపోయార‌ని కూడా నందినీ త‌న ఫ్యామిలీ గురించి చెప్పింది. త‌న తొలి సినిమా అలా మొద‌లైంది సినిమాకు రు. 5 ల‌క్ష‌లు రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్నాన‌ని… ఇక సినిమా ఇండ‌స్ట్రీని ప‌ట్టి పీడిస్తోన్న కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన నందినీ ప్ర‌తి రంగంలోనూ ఇది ఉంటుంద‌ని.. అయితే త‌న‌కు మాత్రం ఇలాంటి అనుభ‌వాలు ఎదురు కాలేద‌ని ఆమె వెల్ల‌డించింది.

ఇక ఇండ‌స్ట్రీలో ఉన్న అనుభ‌వాల గురించి చెప్పిన ఆమె జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న‌ను అక్కా అని పిలుస్తాడ‌ని… బన్నీ, మహేష్, తారక్‌ల‌ను తాను పేరు పెట్టి పిలుస్తాన‌ని చెప్పుకువ‌చ్చింది. ఇక ప్ర‌భాస్‌ను చూస్తే తాను మెస్మ‌రైజ్ అయిపోతాన‌ని.. ప్ర‌భాస్ త‌న ఆల్ టైం ఫేవ‌రెట్ హీరో అని వెల్ల‌డించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news