Moviesమ‌హేష్ ' స‌ర్కారు వారి పాట ' ప్రి రిలీజ్ బిజినెస్‌......

మ‌హేష్ ‘ స‌ర్కారు వారి పాట ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… దుమ్ము రేపిందోచ్‌…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైన‌ర్ స‌ర్కారు వారి పాట‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా రెండేళ్ల నుంచి షూటింగ్‌లోనే ఉంది. గీత‌గోవిందం లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ప‌రశురాం డైరెక్ట్ చేసిన సినిమా ఇదే. అటు స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి సంక్రాంతి హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన గ్లింప్స్‌, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలును స్కై రేంజ్‌కు తీసుకువెళ్లాయి. కీర్తి అందాలు, థ‌మ‌న్ బీజీఎం ఇవ‌న్నీ చూస్తుంటే సినిమాకు రిలీజ్‌కు ముందు బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ళ అయితే క‌నిపిస్తోంది. పైగా మూడు పెద్ద బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై ఈ చిత్రాన్ని కంబైన్డ్‌గా నిర్మించారు.

భారీ అంచ‌నాల నేప‌థ్యంలో స‌ర్కారు వారి పాట సినిమాకు భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 120 కోట్ల‌కు పైగా థియేట్రిక‌ల్ బిజినెస్ జరిగిన‌ట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ‌లో మాత్ర‌మే రు. 100 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని అంటున్నారు. మ‌హేష్‌బాబు క్రేజ్‌తో పాటు ప‌ర‌శురాం ట్రాక్ ఇవ‌న్నీ సినిమాకు ఈ రేంజ్‌లో బిజినెస్ జ‌రిగేందుకు కార‌ణ‌మ‌య్యాయి.

పైగా మ‌హేష్ చివ‌రి సినిమాలు భ‌ర‌త్ అనే నేను – మ‌హ‌ర్షి – స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇక సెన్సార్ నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది. మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న స‌ర్కారు వారి పాట మ‌రి భారీ అంచ‌నాలు అందుకుంటుందో ? లేదో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news