Moviesఎన్టీఆర్ ఎక్కువ‌ టేకులు తీసుకున్న పాత్ర ఇదే... ఆ సినిమా ఇదే...!

ఎన్టీఆర్ ఎక్కువ‌ టేకులు తీసుకున్న పాత్ర ఇదే… ఆ సినిమా ఇదే…!

విశ్వవిఖ్యాత న‌ట సార్వ‌భౌముడిగా పేరు తెచ్చుకున్న అన్న‌గారు ఎన్టీఆర్‌.. ఏ సినిమాలో న‌టించినా.. సింగిల్ టేక్‌తో స‌రిపెట్టేస్తారు. ఆయ‌న కెరీర్‌లో ఎన్నో పాత్ర‌లు వేశారు. అటు పౌరాణిక పాత్ర‌లతో పాటు ఇటు సాంఘీక పాత్ర‌ల్లోనూ న‌టించి అఖిల తెలుగు జ‌నాల మ‌దిలో నిలిచిపోయారు. అందుకే ఆయ‌న చ‌నిపోయి ఇన్నేళ్లు అవుతున్నా చాలా ఇళ్ల‌ల్లో ఆయ‌న కృష్ణుడు, రాముడు వేష‌ధార‌ణ‌లో ఉన్న ఫోటోలు గోడ‌ల‌కు వేలాడుతూ మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటాయి. అంటే ఆ పాత్ర‌ల్లో ఆయ‌న అలా జీవించేశారు.

ఇక ఆయ‌న ఏ పాత్ర వేసినా ఇటు నిర్మాత‌ను , అటు డైరెక్ట‌ర్‌ను కూడా ఆయ‌న సంతృప్తి ప‌రుస్తారు.. అంతేకాదు… అస‌లు ఒక‌టికి మించి ఎక్కువ టేకులు తీసుకుంటే.. ఆయ‌న అవ‌మానంగా ఫీల‌య్యేవారట‌. అంతేకాదు.. ఇలా చేస్తే. నిర్మాత‌కు న‌ష్టం వ‌స్తుంది.. స‌మ‌యం వృథా అవుతుంది.. మ‌న‌దేంపోతుంది! అని తోటి వారితో అనేవార‌ట కూడా! ఈ ఒక్క విష‌యంలోనే కాదు.. పౌరాణిక పాత్ర‌లు న‌టించాల్సి వ‌చ్చిన‌ప్పుడు సాధార‌ణంగా.. ఒక‌టికి రెండు సార్లు టేక్ తీసుకుంటారు.

ఎందుకంటే.. ఆ గెట‌ప్ వేరేగా ఉంటుంది.. ప‌దాల ఉచ్చార‌ణ డ‌బ్బింగుకు అనుగుణంగా ఉండాలి. దీంతో ఒక‌టికి రెండు సార్లు.. డైరెక్ట‌ర్లు చాలా జాగ్ర‌త్త‌గా.. టేకులు తీసుకునేవారు. కానీ.. అన్న‌గారు అదిపౌరాణిక మైనా.. సాంఘిక‌మైనా.. ఒకే ఒక్క టేకుతో అద్భుతంగా చేసేవారు. ఆయ‌నే ఆయా వేషాలు(మేక‌ప్‌) కూడా స్వ‌యంగా వేసుకునేవార‌ట‌. “మేక‌ప్ మెన్ వ‌చ్చి. మ‌న‌ల్ని కూర్చోబెట్టి వేషం వేయాలంటే.. టైం వేస్ట్ త‌మ్ముడూ“ అని అనేసి.. ఆయ‌నే ముందుగా లోకేష‌న్ లేదా.. స్టూడియోకు వ‌చ్చి.. షెడ్యూల్ ప్ర‌కారం.. మేక‌ప్ వేసుకునేవార‌ట‌.

అయితే.. ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న అన్న‌గారు కూడా ఒక వేషం వేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఒక‌టి కాదు.. ఏకంగా.. ఆరేడు టేకులు తీసుకున్న సంద‌ర్భం ఉంద‌ని.. గుమ్మ‌డి రాసుకున్న పుస్త‌కంలో (స్వీయ అనుభ‌వాలు) పేర్కొన్నారు. ఆ సినిమా న‌ర్త‌న శాల‌.ఈ సినిమాలో అన్న‌గారు కృష్ణుడుగాను..అర్జ‌నుడిగాను న‌టించారు. ఈ రెండు వేషాలు వేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఆయ‌న ఇబ్బంది ప‌డ‌లేదు.

కానీ.. ఇదే సినిమాలో బృహ‌న్న‌లగా ఆయ‌న వేషం వేసిన‌ప్పుడు.. పూర్తిగా న‌డ‌క‌, ఆహార్యం అన్నీ మారిపోతాయి. దీనిని షూట్ చేయాల్సిన స‌మయంలో మాత్రం అన్న‌గారు ఒక‌టికి రెండు మార్లు టేకులు తీసుకుని జాగ్ర‌త్త‌గా చేశార‌ని.. గుమ్మడి పేర్కొన్నారు. బ‌హుశ అన్నగారి జాగ్ర‌త్త‌లే కాబోలు.. ఆ పాత్ర‌కు జీవం పోశాయ‌ని.. ఆయ‌న రాసుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news