Moviesఎన్టీఆర్ కు చిరకాలం గుర్తుండిపోయేలా..బిగ్గెస్ట్ గిఫ్ట్ రెడి చేసిన కొరటాల..!!

ఎన్టీఆర్ కు చిరకాలం గుర్తుండిపోయేలా..బిగ్గెస్ట్ గిఫ్ట్ రెడి చేసిన కొరటాల..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ళు పైగా కష్టపడ్డ తారక్..సినిమాలో ప్రాణం పెట్టి నటించి..అభిమానుల చేత శభాస్ అనిపించుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన తారక్..ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి అప్ డేట్ ఎప్పుడేప్పుడు వస్తుందా అంటూ బ్వెయిట్ చేసిన అభిమానులకు డైరెక్టర్ కొరటాల్ మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు చరణ్ లతో కలిసి కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఏప్రిల్ 29 న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో కొరటాల తారక్ తో సినిమా పై రియాక్ట్ అయ్యాడు. అంతేకాదు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే న్యూస్ అందించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని #NTR30 అని పిలిచుకుంటున్నామని చెప్పిన ఆయన.. ఈ సినిమాలో తారక్ రోల్ ఎలా ఉంటుందో మీరు అస్సలు ఊహించలేరు అంటూ..సినిమా పై హైప్ ఇచ్చారు. అంతేనా.. ఈ సినిమా కు సంబంధించిన అసలు మ్యాటర్ తారక్ పుట్టిన రోజు అనగ మే 20న పెద్ద అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ కోసం చిరకాలం గుర్తుండిపోయేలా ఓ అద్భుతమైన క్యారెక్టర్‌ని డిజైన్ చేశానని కొరటాల చెప్పారు.

ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసిన్నత్లు తెలుస్తుంది. నిజానికి షూటింగ్ మొదలై మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. కానీ తారక్ RRRతో బిజీ..కొరటాల చిరు తో బిజీ..అందుకే ఇంత లేట్ అయ్యిందట. వన్స్ ఒకసారి రంగంలోకి దిగాకా .. మూడు షెడ్యూల్స్‌లలో ఈ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు టీం. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ NTR 30ని ఎలా డైరెక్ట్ చేస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించ‌నున్నారు. ఇక ఈ సినిమా జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుందని..ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కానుందని, ఎన్టీఆర్‌ను మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో క్రేజీగా చూపించబోతున్నాము అంటూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news