Moviesనంద‌మూరి ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్‌... ' క‌ళ్యాణ్‌రామ్ బింబిసార ' రిలీజ్...

నంద‌మూరి ఫ్యాన్స్‌కు కిక్ న్యూస్‌… ‘ క‌ళ్యాణ్‌రామ్ బింబిసార ‘ రిలీజ్ డేట్ ఫిక్స్‌…!

నంద‌మూరి హీరోలు వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. క‌రోనా క‌ష్టాల త‌ర్వాత గ‌తేడాది డిసెంబ‌ర్లో బాల‌య్య న‌టించిన అఖండ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఏ ముహూర్తాన బాల‌య్య అఖండ రిలీజ్ చేశాడో కాని.. ఇప్ప‌ట‌కీ టాలీవుడ్ సినీ జ‌నాలు అఖండ మానియాలోనే మునిగి తేలుతున్నారు. అఖండ వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లోనే బుల్లితెర‌పై ప్రీమియ‌ర్ షోగా వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

ఇక మ‌రో నంద‌మూరి హీరో ఎన్టీఆర్ మూడున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం మామూలుగా లేదు. ఎన్టీఆర్ అరాచ‌కంతో నంద‌మూరి అభిమానుల‌కు మ‌ళ్లీ మాంచి కిక్ వ‌చ్చింది. బాబాయ్‌, అబ్బాయ్ వ‌రుస హిట్ల త‌ర్వాత ఇప్పుడు మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కూడా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

క‌ళ్యాణ్‌రామ్ న‌టించిన బింబిసార. మ‌నోడి కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉంది. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. రేర్ బ్యాక్ డ్రాప్లో తెర‌కెక్కిన ఈ సినిమాపై టాలీవుడ్ వ‌ర్గాల్లోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి. సినిమాపై ఆడియెన్స్‌లో ఓ ఎట్రాక్ష‌న్ అయితే క్రియేట్ అయ్యింది. ఇక ఈ రోజు ఉగాది కానుక‌గా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

బింబిసార‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్టు 5న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కేథ‌రిన్ థెస్రాతో పాటు భీమ్లానాయ‌క్‌లో రానాకు జోడీ క‌ట్టిన సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. చ‌రిత్ర‌లో మ‌గ‌ధ సామ్రాజ్యంలో బింబిసారుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు చాలా మంది భార్య‌లు ఉండేవార‌ని.. అత్యంత క్రూరుడు అన్న చ‌రిత్ర ఉంది.

మ‌రి దానిని వ‌శిష్ట్ మ‌ల్లిడి ఎలా తెర‌మీద‌కు తీసుకు వ‌చ్చాడా ? అన్న ఆస‌క్తి అయితే అంద‌రిలోనూ ఉంది. ఎంఎం. కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమాను క‌ళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్లో నిర్మించారు. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాన్ త‌న సోద‌రుడు తార‌క్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే సినిమాను కూడా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news