Moviesబ‌న్నీ ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు స్టార్ హీరోలు... ఇంట్ర‌స్టింగ్...

బ‌న్నీ ఆర్య సినిమాను రిజెక్ట్ చేసిన ఇద్ద‌రు స్టార్ హీరోలు… ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ కె. రాఘవేంద్ర రావు వందో సినిమా గంగోత్రితో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తొలి సినిమాతోనే బ‌న్నీ హిట్ కొట్టినా.. ఆ క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా యూత్‌కు చేరువ కాలేదు. అయితే సుకుమార్ తొలి సినిమా.. బ‌న్నీకి రెండో సినిమా ఆర్య‌తో అదిరిపోయే హిట్ కొట్ట‌డంతో పాటు యూత్‌కు బాగా చేరువ అయిపోయాడు. ఆర్య‌లో సుకుమార్ క్రియేటివిటి.. ఆల్రెడీ ప్రేమ‌లో ఉన్న అమ్మాయిని ప్రేమించ‌డం.. ఇవ‌న్నీ బాగా కిక్ ఇచ్చాయి. బ‌న్నీ కెరీర్‌లో తిరుగులేని బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా ఆర్య నిలిచింది. త‌ర్వాత ఈ సినిమా టైటిల్‌తో ఆర్య 2 కూడా తీశారు.

ఆర్య‌ను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు. రాజుకు కూడా ఆర్య బంప‌ర్ లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఆర్య సినిమా వెన‌క ఓ ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉంది. దిల్ రాజు ఈ విష‌యాన్ని త‌న తాజా ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట పెట్టారు. ఈ క‌థ విన్నాక సుకుమార్‌ను ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు పంపారు. అప్ప‌టికే దిల్ రాజు బ్యాన‌ర్లో ర‌వితేజ ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే క‌థ విన్న ర‌వితేజ చాలా బాగా న‌చ్చింద‌ని.. అయితే త‌న ఇమేజ్‌కు సూట్ కాద‌ని రిజెక్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ర‌వితేజ ఆ బ్యాన‌ర్లో భ‌ద్ర చేశాడు.

ఇక సుకుమార్ అదే క‌థ‌ను దిల్ రాజు సూచ‌నల మేర‌కు ప్ర‌భాస్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్లాడు. ఈ క‌థ త‌న ఇమేజ్‌కు సూట్ కాద‌ని చెప్పి ప్ర‌భాస్ కూడా రిజెక్ట్ చేశాడు. అటూ ఇటూ తిరిగి చివ‌ర‌కు బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు ఈ క‌థ చేరింది. క‌థ బ‌న్నీతో పాటు అల్లు అర‌వింద్‌కు కూడా న‌చ్చ‌డంతో అలా తొలి ప్ర‌య‌త్నంలోనే మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేసే బంప‌ర్ ఛాన్స్ సుకుమార్‌కు ద‌క్కింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక యూత్‌కు స్లో పాయిజిన్‌లా ఎక్కేసింది. త‌ర్వాత కొంత కాలం పాటు బ‌న్నీ వెన‌క్కు తిరిగి చూసుకునే అవ‌కాశం కూడా లేకుండా పోయింది.

అయితే ఇదే క‌థ‌ను బ‌న్నీ కాకుండా ర‌వితేజ, ప్ర‌భాస్ చేసినా హిట్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి. వారిద్ద‌రికి కూడా అప్ప‌టికే యూత్‌లో మాంచి క్రేజ్ ఉంది. ఏదేమైనా ర‌వితేజ, ప్ర‌భాస్ వ‌దులుకోవ‌డం బ‌న్నీకి చాలా క‌లిసొచ్చింది. ఇక ఆర్య హిట్ కొట్ట‌డంతో సుకుమార్ – బ‌న్నీ కాంబినేష‌న్ ఆ త‌ర్వాత ఆర్య 2, ఇప్పుడు పుష్ప‌.. త్వ‌ర‌లోనే పుష్ప 2 ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news