Movies15 రోజుల‌కు స‌న్నీలియోన్‌కు అంత రెమ్యున‌రేష‌నా... మంచు విష్ణును పిండేసిందే..!

15 రోజుల‌కు స‌న్నీలియోన్‌కు అంత రెమ్యున‌రేష‌నా… మంచు విష్ణును పిండేసిందే..!

మంచు విష్ణు గ‌తేడాది పెద్ద పోటీలో ప్ర‌కాష్‌రాజ్‌ను ఓడించి మా అధ్య‌క్షుడు అయ్యాడు. మా అధ్య‌క్షుడు అయ్యేందుకు విష్ణు చాలా వాగ్దానాలు కూడా చేశాడు. ఇవ‌న్నీ ఇలా ఉంటే విష్ణు ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా కాస్త వెన‌క‌ప‌డ్డాడు. చివ‌రిసారిగా విష్ణు నుంచి మోస‌గాళ్లు సినిమా మాత్ర‌మే వ‌చ్చింది. రు. 50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింద‌ని ప్ర‌చారం చేసుకున్న ఈ సినిమా క్యూబ్ ఖ‌ర్చులు, థియేట‌ర్ రెంట్లు కూడా రాబ‌ట్ట‌లేదు. అటు మోహ‌న్‌బాబు తాజాగా న‌టించిన స‌న్నాఫ్ ఇండియా ఎంత డిజాస్ట‌ర్ అయ్యిందో చూశాం.

ఓవ‌రాల్‌గా సినిమాల ప‌రంగా మంచు ఫ్యామిలీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బారుతోంది. ఈ టైంలో ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో విష్ణు హీరోగా ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్‌ను తిరుప‌తి స‌మీపంలో ముగించారు. హాట్ శృంగార తార స‌న్నీలియోన్ కూడా ఈ సినిమా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

గాలి నాగేశ్వ‌ర‌రావులో స‌న్నీలియోన్ ఎన్నారై యువ‌తిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. రేణుక అనే పాత్ర‌లో ఆమె న‌టిస్తోంద‌ని ర‌చ‌యిత కోన వెంక‌ట్ తెలిపారు. కోన వెంక‌ట్ ఈ సినిమాకు క‌థ అందించారు. మంచు ఫ్యామిలీ నుంచి ఇటీవ‌ల కాలంలో మంచి సినిమా రాలేద‌న్న లోటు ఈ సినిమా తీరుస్తుంద‌ని కోన లాంటి వాళ్లు చెపుతున్నారు. విష్ణు ఇమేజ్‌కు త‌గిన‌ట్టుగా కోన డిఫ‌రెంట్ క‌థ అందించాడ‌ట‌.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో న‌టించేందుకు 15 రోజుల కాల్షీట్లు ఇచ్చినందుకే స‌న్నీ రు 2.5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకోబోతోంద‌ట‌. 15 రోజుల షూటింగ్ కాల్షీట్ల‌తో పాటు మ‌రో 5 రోజులు ప్ర‌మోష‌న్లు క‌లిపి మొత్తం 20 రోజుల డేట్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. 15 రోజులు న‌టించేందుకే రు 2.5 కోట్ల అంటే ఆమెకు బాగానే ముట్టింద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు అనుకుంటున్నారు. ప్ర‌స్తుతం పూజా హెగ్డే, స‌మంత‌, ర‌ష్మిక లాంటి వాళ్ల‌కే ఈ రేంజ్లో రెమ్యునరేష‌న్ ముడుతోంది.

పైగా వాళ్లు సినిమా కోసం పూర్తి స్థాయిలో కాల్షీట్లు ఇస్తారు. స‌న్నీకి మాత్రం 15 రోజుల‌కే స్టార్ హీరోయిన్ రేంజ్ రెమ్యున‌రేష‌న్ ముడుతోంది. మామూలుగానే విష్ణు సినిమాల‌కు అంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌రు.. కానీ స‌న్నీ డిమాండ్ చేయ‌డంతో మంచు వాళ్లు అంత స‌మ‌ర్పించుకోక త‌ప్ప‌లేదు. ఇటీవ‌ల ఫ‌స్ట్ షెడ్యూల్ ముగిసిన వెంట‌నే స‌న్నీలియోన్‌ను మోహ‌న్‌బాబు త‌న వ‌ర్సిటీకి తీసుకువెళ్లి విద్యార్థుల‌కు హాయ్‌తో ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news