MoviesOfficial: గోపీచంద్‌‌కి మదర్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఇక బొమ్మ బద్దలవ్వాల్సిందే..!!

Official: గోపీచంద్‌‌కి మదర్ గా ఒకప్పటి స్టార్ హీరోయిన్..ఇక బొమ్మ బద్దలవ్వాల్సిందే..!!

ఒకప్పుడు తమ అందచందాలతో కుర్రాళ్లను ఉర్రూతలూగించిన హీరోయిన్లందరూ ఇప్పుడు తమ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. ఇలాంటి పాత్రనే చేయాలి అని గిరి గీసుకోకుండా..తమకు వచ్చిన.. నచ్చిన.. మెచ్చిన పాత్రలకు సైన్ చేస్తూ..50 ప్లస్ లోను బిజీ గా గడుపుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో కే వస్తుంది ..ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ “ఖుష్బూ”. ఇప్పటికే ఈమె చాలా మంది హీరోల సినిమాలల్లో అక్కగా, తల్లిగా, అత్త పాత్రల్లో అంటిస్తూ.. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. అప్పట్లో చిరంజీవికి అక్కగా స్టాలిన్ సినిమాలో నటించి..అభిమానులను మెప్పించిన ఈమె ఆ తరువాత పవన్ సినిమాలో కూడా తల్లిగా కనిపించి తనలోని నటనా టాలెంట్ ను మరోసారి అందరికి పరిచయం చేసింది.

ఇక శర్వానంద్-రష్మిక జంట గా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూదా కీలక పాత్రలో కనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే సినిమా కధకు ఈమె మెయిన్ హెడ్..ఈమె మీదనే స్టోరీ మలుపు తిరుగుతుంది. అంతటి ఇంపార్టేంట్ రోల్ ని పోషిస్తుంది “ఖుష్బూ”. ఇక ఇప్పుడు ఈమె మరో స్టార్ హీరో సినిమాలో కూదా నటిస్తున్నట్లు కన్ ఫాం అయ్యింది.

 

గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా బాధ పడుతున్న గోఫీచంద్ ఆ మధ్య సీటీమార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మళ్లీ ఆయనకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ డైనమిక్ డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌‌ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్‌ నటిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు గాసిప్ గా అనుకున్న ఈ వార్తను నిజం చేస్తూ టీం అఫిషీయల్ గా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాని ప్రకటించారు. దీంతో సినిమా పై మరింత భారీ అంవ్చనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news