Moviesసుధీర్‌ నిశ్చితార్ధం చేసుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..పూర్తి డీటైల్స్ ఇవే..!!

సుధీర్‌ నిశ్చితార్ధం చేసుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..పూర్తి డీటైల్స్ ఇవే..!!

గత 24 గంటల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండింగ్ లో ఉంది. అదే.. జబర్దస్థ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కి పెల్లి ఫిక్స్ అయ్యిందా..నిశ్చితార్ధం కూడా అయిపోయిందా..? ఇదే వార్త నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. నిన్న మొన్నతి వరకు సుధీర్ ని తెర పై లవర్స్ గా చిత్రీకరించిన టీవి షోలో..ఇప్పుడు అదే టీవి షోలో సుధీర్ నిశ్చితార్ధం జరిగిన్నత్లు చూయించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలోకి వెళ్లితే..

సుడిగాలి సుధీర్ జీవితంలో ఎన్నో క్ష్టాలు పడి..బాధలను అనుభవించి..జబర్దస్థ్ అనే కామెడీ షో ద్వార ఇంత పాపులారిటినీ సంపాదించుకున్నాడు. సుధీర్ పేరు చెప్పగానే మనకు మరో పేరు కూడా వెనక కనిపిస్తుంది. అదే రష్మి గౌతమ్. వీళ్లు నిజంగానే లవ్ లో ఉన్నారా..? లేక డబ్బులు కోసమే అలా నటిస్తున్నారా అనే విషయం తెలియదు కానీ..వీళ్లను అభిమానించే అభిమానుల గుండెల్లో మాత్రం..సుధీర్-రష్మి మంచి కపుల్స్ గానే ఉండిపోయారు. సుధీర్‌ కూడా చాలా ఇంటర్వ్య్లల్లో.. తన లైఫ్‌లోకి రష్మి వచ్చిన తర్వాతనే ఆయనకు అంతగా గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు. రష్మి లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడు కాదని ఎన్నో సార్లు జబర్దస్థ్ స్టేజీ పై చెప్పారు. అయితే ఇంతకాలం వీరి మధ్య లవ్ ట్రాక్ నడిపించి టీఆర్పి లతో డబ్బులు వెనకేసుకున్న వారు ఇప్పుడు తెర పైకి మరో కొత్త అమ్మాయిని తీసుకొచ్చిన్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా సుధీర్ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ కు నిశ్చితార్ధం అయ్యిన్నట్లు చూయించారు. ఇదేం పెద్ద కొత్తకాదు..గతంలో రష్మి తో ఏకంగా పెళ్లినే చేసేసారు. కానీ ఇక్కడ సుధీర్ పక్కన ఉంది రష్మి కాదు.. మరో కొత్త ఫెస్. దీంతో జనాలు షాక్ అవుతున్నారు. సుధీర్ నిజంగానే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమెనా అంటూ చర్చలు మొదలు పెట్టారు. కానీ, అసలు మ్యాటర్ ఏమిటంటే ఇది కేవలం ఎంటర్ టైన్ చేయడానికే చేశారట.

 

ఇక ఈ ఫోటోలో సుధీర్ పక్కన కనిపిస్తున్న ఈ అమ్మయి పేరు తేజస్వీ నాయుడు. ఈమె ఒక మోడల్. చూడగానే ఆకట్టుకునే విధంగా స్మైల్ చేస్తూ ఉండే తేజస్వీ పలు వెబ్ సిరీస్ లోను నటించింది. రీసెంట్ గా ఆహా లో వచ్చిన సామజవరగమన అనే సిరీస్ లో నతించి మంచి మార్క్లు కొట్టేసింది. దీంతో ఆమె పాపులారిటిని ఉపయోగించుకోవాలి అనుకున్న సదురు టీవీ యాజమాన్యం..తనతో ఓ షో ని ఇలా ప్లాన్ చేశారంటున్నారు నెటిజన్స్. ఇక తేజస్వీ మోడల్‌గా కూడా కొన్ని యాడ్ షూట్స్ చేసింది. అయితే ఇప్పటివరకు పెద్దగా పట్టించుకోని అమ్మడుని.. సుధీర్‌తో ఎంగేజ్‌మెంట్ అయినట్టుగా వీడియో బయటికి వచ్చిన తర్వాత ఆమె ఎవరా..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అని అందరూ గూగుల్ తల్లిని అడుగుతున్నారు. ఒక్కటై అయితే నిజం ..ఈమె తో సుధీర్ నిశ్చితారధం అంతా నాటకం..కేవలం ఎంటర్ టైన్ చేయడానికే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news