Movies' రాధేశ్యామ్‌కు ' బుల్లెట్ దింపేసిన ' క‌శ్మీర్ ఫైల్స్‌ '...

‘ రాధేశ్యామ్‌కు ‘ బుల్లెట్ దింపేసిన ‘ క‌శ్మీర్ ఫైల్స్‌ ‘ … మామూలు దెబ్బ కాదు బాబోయ్‌..!

ఏ సినిమాకు అయినా ఎంత పెద్ద హిట్ అని గొప్ప‌లు పోయినా.. ఎంత బ‌డ్జెట్ పెట్టాం అని చెప్పుకున్నా.. మీడియా.. సోష‌ల్ మీడియాలో ఎన్ని గొప్ప వార్తలు వ‌చ్చినా అంతిమంగా క‌లెక్ష‌న్లే సినిమా రేంజ్‌ను డిసైడ్ చేస్తాయి. ఇక డైరెక్ట్ పాయింట్‌లోకి వెళ్లిపోతే రు. 300 కోట్ల‌తో తెర‌కెక్కించిన ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా ఎన్నో అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తొలి రోజు ఇక్క‌డ అన‌కాప‌ల్లి నుంచి తెలంగాణ‌లో ఆదిలాబాద్ టు అమెరికా వ‌ర‌కు ఎక్క‌డ చూసినా ఈ సినిమా గురించిన చ‌ర్చే న‌డిచింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు రెండు, మూడు రోజుల నుంచి ఈ సినిమా అమెరికాలో పడిపోతోంది. రాధేశ్యామ్ వ‌సూళ్లు అక్క‌డ భారీగా డ్రాప్ అవుతున్నాయి. మ‌న సినిమాల‌కు ఇటీవ‌ల ఓవ‌ర్సీస్ మార్కెట్ ఎంత‌లా పెరుగుతూ వ‌స్తుందో ? చూస్తూనే ఉన్నాం. యూఎస్‌లో ఇప్పుడు చిన్న చిన్న సినిమాలే ఏకంగా 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌డుతున్నాయి. యూఎస్ మార్కెట్‌లో హిట్ టాక్ వ‌స్తే మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా భారీగానే కొల్ల‌గొడుతున్నాయి.

క‌ట్ చేస్తే రాధేశ్యామ్ సినిమా కంటే చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా దూసుకుపోతోన్న క‌శ్మీర్ ఫైల్స్ సినిమా యూఎస్ బాక్సాఫీస్ ఆదివారం త‌న జోరు చూపించింది. ఆదివారం వ‌సూళ్లు మాత్ర‌మే చూస్తే కశ్మీర్ ఫైల్స్ $ 202,565 డాలర్లు – రాధేశ్యామ్ $ 155,505 డాలర్లు కొల్ల‌గొట్టాయి. ఇక అలియా భ‌ట్ గంగూబాయి కతియావాడి $ 112,228 డాలర్లు – భీష్మ పర్వం $ 31,461 డాలర్లు – సూర్య ఈటీ $ 17,002 డాలర్లు కొల్ల‌గొట్టాయి.

ఇక భీమ్లానాయ‌క్ ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్ ర‌న్ దాదాపు ముగిసిన‌ట్టే చెప్పాలి. ఇక సూర్య ఈటీ ఘోరాతి ఘోరంగా డిజ‌ప్పాయింట్ చేసింది. ఆ మాట‌కు వ‌స్తే ఆ సినిమా త‌మిళ్‌లో బాల్చీ త‌న్నేసింది. ఇక గంగూబాయి కాస్త మెరుగైన ప్ర‌ద‌ర్శ‌నే చేసింద‌నుకోవాలి. ఆ సినిమాకు 1.12, 228 డాల‌ర్లు వ‌చ్చాయి. విచిత్రం ఏంటంటే రు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్‌.. బాహుబ‌లి, సాహో ఇమేజ్ ఇవ‌న్నీ కూడా రాధేశ్యామ్‌ను ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల‌కు చేరువ చేయ‌లేక‌పోయాయి.

ఓవ‌రాల్‌గా చూస్తే ఇంత పెద్ద బ‌డ్జెట్‌, పెద్ద ఇమేజ్‌లు ఇవ‌న్నీ కూడా క‌శ్మీర్ ఫైల్స్ ముందు రాధేశ్యామ్‌ను ఓవ‌ర్సీస్‌లో కాప‌డ‌లేక‌పోయాయి. ఇటు నార్త్‌లో కూడా మూడు రోజుల‌కు రాధేశ్యామ్‌కు రు. 14 కోట్ల నెట్ వ‌స్తే… క‌శ్మీర్ ఫైల్స్ కు రు. 26 కోట్ల నెట్ వ‌చ్చింది. క‌శ్మీర్ ఫైల్స్ నార్త్‌లో, ఓవ‌ర్సీస్‌లో రాధేశ్యామ్‌ను మామూలు దెబ్బ కొట్ట‌లేద‌నే చెప్పాలి. ఇక ఈ సినిమాను తెలుగు వాడైన అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌గా.. ప్ర‌ధాని మోడీ సైతం ఈ సినిమా యూనిట్‌ను మెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news