Moviesభార్యలతో విడాకులు..నేను చాలా లక్కి..అమీర్ నోటి నుండి ఊహించని మాటలు..!!

భార్యలతో విడాకులు..నేను చాలా లక్కి..అమీర్ నోటి నుండి ఊహించని మాటలు..!!

బాలీవుడ్ లో మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అనగానే అందరికి టక్కున గుర్తు వచ్చేది అమీర్ ఖాన్. ఎంత ఏజ్ వస్తున్న ఆ హ్యాండ్ సమ్ లుక్స్ ..ఆ బాదీ లో మాత్రం మార్పు రాదు. నటన పరంగా ది బెస్ట్ పర్ ఫామెన్స్ ఇచ్చే ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ది బెస్ట్ భర్తగా నిలుచోలేకపోయారు. మనకు తెలీసందే అమీర్ ఇప్పటి వరకు రెండు పెళ్ళిలు చేసుకుని ఇద్దరికి విడాకులు ఇచ్చేశారు. రీజన్ చెప్పనప్పటికి నెటిజన్స్ మాత్రం ఆయన మరో హీరోయిన్ పై మోజు పడ్డారని అందుకే వీళ్ళను వదిలేశాడని అంటున్నారు.

అమీర్ ఖాన్ దాంప‌త్య జీవితానికి ఎంతో విలువ ఇస్తార‌న్న అభిప్రాయం అంద‌రికి ఉండేది. కాని అది తప్పు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక కూడా అమీర్ త‌న మొద‌టి భార్య రీనాకు విడాకులు ఇచ్చారు. వీరి విడాకులు అప్ప‌ట్లోనే చాలా మందికి న‌చ్చ‌లేదు. పెద్ద దుమారమే రేగింది. ఆ త‌ర్వాత అమీర్ కిర‌ణ్ రావు ల‌గాన్ సినిమా టైంలో మంచి ఫ్రెండ్ షిప్ కుదిరింది. ఆ తరువాత ఆ స్నెషంగా ఏర్ప‌డిన ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారి వారు పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. కానీ తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు ఈ జంట. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు. ఇప్పటివరకు విడాకులపై నోరువిప్పని అమీర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఇద్దరు మాజీ భార్యల గురించి చెప్పుకొచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “మా విడాకుల గురించి జ‌నాలు అర్థం చేసుకోవడం చాలా కష్టమ‌ని అన్నారు. జనరల్ గా విడాకులు తీసుకున్న తర్వాత ఏ జంట‌ ఒకరిని మరొకరు పట్టించుకోరు..తిట్టుకుంటారు శాపనార్ధలు పెట్టుకుంటారు గోలా చేసుకుని ఒకరి పరువు మరోకరు తీసుకుంటారు. వారిద్ద‌రి మ‌ధ్య అంత కోపం ఉంటుంది..కానీ, మేము మాత్రం అలా కాద‌ని, విడిపోయిన తరువాత కూడా చాలా ఫ్రెండ్లీ గా ఉంటామని చెప్పుకొచ్చాడు. తాము వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నామ‌ని ..విడిపోయిన తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నామ‌ని తెలిపారు. నా మాజీ భార్యలతో మంచి బంధమే ఉండడం నా అదృష్టం అని చెప్పుకొచ్చారు: అమీర్ ఖాన్. ప్ర‌స్తుతం ఆమీర్ – క‌రీనా క‌లిసి న‌టిస్తోన్న లాల్‌సింగ్‌ చద్దా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆమీర్ త‌న మూడో పెళ్లి విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని బీ టౌన్‌లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఆమీర్ త‌న సినిమాతో బిజీగా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news