Moviesఆయన తో రిలేషన్‌ నాకేంతో స్పెషల్‌..తెర పై కొత్త బాంబ్ పేల్చిన...

ఆయన తో రిలేషన్‌ నాకేంతో స్పెషల్‌..తెర పై కొత్త బాంబ్ పేల్చిన హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో హిట్ కొట్టని హీరో,హీరోయిన్లు ఉన్నారెమో కానీ..లవ్ లో పడకుండా ఉన్న హీరోయిన్లు లేరు. ఉన్నా అది చాలా తక్కువ మంది. ఫింగర్ కౌంటింగ్ చేయచ్చు. అంత తక్కువ మంది ఉంతారు. ఒక సినిమాలో కలిసి నతించే టైంలో ఏదో ఒక సంధర్భంలో ఇద్దరు ఇష్టపడి ..కొన్ని రోజులు ప్రేమించి పెల్లి చేసుకుని..హ్యాపీగా పిల్లలతో గదిపేవారు ఉన్నారు. ఏదో సమస్యలతో మధ్యలోనే విడాకులు తీసుకున్న వారు ఉన్నారు. కానీ, ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోకుండా ఉండి సింగిల్ గా మిగిలిపోయిన వారు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళు పెళ్ళి చేసుకోరా..? అంటే నో అని చెప్పలేం. పోనీ చేసుకుంటారా అంటే యస్ అని చెప్పలేం..కాలమే ఈ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలి.

అయితే తాజాగా ఓ హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లో తన ప్రేమ విషయాని బయట పెట్టి సంచలన కామెంట్స్ చేసింది. బిందుమాధవి..ఈ హీరోయిన్ గుర్తుంది కదా..చూడటానికి చక్కటి రూపం..చూడగానే ఆకట్టుకునే స్మైల్..నవ్వగానే పడే ఆ సొట్ట..కానీ ఏం లాభం మన ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ‘అవకాయ బిర్యానీ’, ‘బంపర్ ఆఫర్’, ‘రామరామ కృష్ణకృష్ణ’ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన తెలుగు హీరోయిన్ బిందు మాధవి. ఆ తర్వాత ఇక్కడ మంచి ఆఫర్లు లేకపోవడంతో ప్రస్తుతం తమిళంలో నటిస్తోంది. అక్కడ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ ఓటీటీలో కి 15వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది సీనియర్ హీరోయిన్ బిందు మాధవి. దీంతో మర్చిపోయిన ఈ హీరోయిన్ ని మళ్లీ అంతా గుర్తు తెచ్చుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అందరికీ ఆవకాయ బిర్యానీ తినిపిస్తా అంటూ గేమ్ ప్లాన్ చెప్పింది బిందు మాధవి. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్లు వారి వ్యక్తిగత విషయాలను హౌస్‌మేట్స్‌తో పంచుకోవాలి. ఈ క్రమంలోనే తన ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేసింది.

ఆమె మదనపల్లి కాలేజీలో చదువుకునే రోజుల్లో నే ఒక అబ్బాయిని ప్రేమించిందని..ఆ అబ్బాయి కూడా తనను ప్రేమించాడని. కానీ అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయాడని.. ఆమె మాత్రం నటన మీదున్న ఇంట్రెస్ట్ తొ ఇక్కడే ఉండిపోయానని. అంతేకాదు అతనికి పెళ్లికూడా అయిపోయిందని..కానీ ఇప్పటికీ ఆ రిలేషన్‌ తనకెంతో స్పెషల్‌ అని చెప్పుకొచ్చింది మాధవి. కానీఆ అబ్బాయి పేరు మాత్రం ఎక్కడ చెప్పకుండా జాగ్రత్త పడింది. ఇంత మంచి అమ్మాయిని వదులుకున్నా ఆ అన్ లక్కి బాయ్ ఎవరా అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news