Moviesనాపై త్రివిక్ర‌మ్ కుట్ర‌.. బండ్ల గ‌ణేష్ ఆడియో లిక్ సంచ‌ల‌నం..!

నాపై త్రివిక్ర‌మ్ కుట్ర‌.. బండ్ల గ‌ణేష్ ఆడియో లిక్ సంచ‌ల‌నం..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ఎంత పెద్ద అభిమానో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ సినిమా ఫంక్ష‌న్ జ‌రిగినా ప‌వ‌న్ భ‌క్తుడు మాట్లాడే మాట‌లు.. ప‌వ‌న్‌ను కీర్తించే విధానం, చేసే కామెడీ మామూలుగా ఉండ‌దు. ఒక్కోసారి గ‌ణేష్ త‌న‌ను పొగుడుతుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ప‌డి ప‌డి న‌వ్వుకుంటూ ఉంటారు. అందుకే ప‌వ‌న్ తొలిసారి గ‌ణేష్‌కు తీన్‌మార్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ త‌ర్వాత మ‌రోసారి వెంట‌నే గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాకు కూడా కాల్షీట్లు ఇచ్చాడు. ఓ చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఉన్న త‌న‌ను ప‌వ‌న్ పెద్ద నిర్మాత చేశాడ‌ని గ‌ణేష్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందు గ‌ణేష్ ప‌వ‌ర్ స్టార్ అభిమానితో మాట్లాడిన‌ట్టు ఓ ఆడియో వైర‌ల్ అవుతోంది. ఈ రోజు జ‌రిగే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఇద్ద‌రూ ముఖ్య అతిథులుగా హాజ‌రు అవుతున్నారు. అటు వైపు బండ్ల గ‌ణేష్‌గా మాట్లాడిన వ్య‌క్తిని ప‌వ‌న్ అభిమాని ఈవెంట్‌కు వెళుతున్నావా ? అని ప్ర‌శ్నించాడు. అందుకు గ‌ణేష్ స్పందిస్తూ ముందు వెళుతున్నాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత త‌న‌పై కుట్ర జ‌రుగుతోంద‌ని మండిప‌డ్డాడు.

తాను స్పీచ్ కూడా రెడీ చేసుకున్నా అని.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళుతున్నా.. అయితే వాళ్లు త‌న‌ను పిల‌వ‌లేద‌ని గ‌ణేష్ ఆ కుర్రాడితో త‌న ఆవేద‌న పంచుకున్నాడు. గ‌ణేష్‌గా మాట్లాడిన వ్య‌క్తి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశాడు. ఈవెంట్‌కు న‌న్ను పిల‌వ‌లేద‌మ్మా ? ఆడు త్రివిక్ర‌మ్ గాడు డౌన్ అవుతాడ‌నే న‌న్ను పిల‌వ‌వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. వాడు వైసీపీ నాయ‌కుల‌తో క‌లిసి పెద్ద ప్లానే వేసుకున్నాడు.. అందుకే తాను వెళ్ల‌డం లేద‌మ్మా ? అంటూ గ‌ణేష్ అనే వ్య‌క్తి చెప్పాడు.

ఈ కాల్ రికార్డింగ్ చివ‌ర్లో ప‌వ‌న్ అభిమాని అన్నా నువ్వు పిల‌వ‌క‌పోయినా వెళ్లు అమ్మా ? అని గ‌ణేష్‌కు చెప్ప‌డంతో పాటు నువ్వు లేక‌పోతే మేం మిస్ అవుతామ‌ని చెప్పాడు. వెంట‌నే గ‌ణేష్ బండ్ల‌న్న బండ్ల‌న్న అని ఆడిటోరియం మొత్తం అర‌వండి.. వెంట‌నే తాను ప‌క్క‌నే ఉండి లోప‌ల‌కు వ‌స్తాన‌ని చెప్పాడు. ఈ ఆడియో ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news