Moviesఓయో రూమ్స్‌గా మారిన స‌న్ ఆఫ్ ఇండియా థియేట‌ర్స్‌.. ఇదేం ట్విస్టురా...

ఓయో రూమ్స్‌గా మారిన స‌న్ ఆఫ్ ఇండియా థియేట‌ర్స్‌.. ఇదేం ట్విస్టురా బాబు..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన స‌న్ ఆఫ్ ఇండియా సినిమా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రిలీజ్‌కు ముందే ఎలాంటి అంచ‌నాలు లేక‌పోవ‌డంతో పాటు అస‌లు బిజినెస్స్ కూడా జ‌ర‌గ‌లేదు. దీంతో నిర్మాత మంచు విష్ణు స్వ‌యంగా ఈ సినిమాను ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ‌లో 350 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసుకునేలా బుక్ చేసుకున్నారు. అయితే రిలీజ్ రోజు మార్నింగ్ షోకే జ‌నాలు లేక‌పోవ‌డంతో 100 థియేట‌ర్ల‌ను లేపేశారు. ఫ‌స్ట్ షో ప‌డిందో లేదో మ‌రో 50 థియేట‌ర్లు ఎగిరిపోయాయి.

చివ‌ర‌కు రెండో రోజుకే జ‌నాలు లేక మ‌రో 100 థియేట‌ర్లు ఎత్తేశారు. రెండో రోజు సాయంత్రానికే థియేట‌ర్ల నుంచి ఈ సినిమా బిచానా ఎత్తేసింది. మూడో రోజు చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లో మాత్ర‌మే ఈ సినిమాను రిలీజ్ చేశారు. రెండు, మూడో రోజు ఈ సినిమాను బ‌ల‌వంతంగా కొన్ని థియేట‌ర్ల‌లో కంటిన్యూ చేసినా కూడా కేవ‌లం ఇద్ద‌రు, ముగ్గురు ప్రేక్ష‌కులు మాత్ర‌మే వ‌చ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి.

ఎవ్వ‌రూ రాక‌పోవ‌డంతో ప్రేమ జంట‌లు అయితే ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల‌ను ఓయో రూమ్స్ మాదిరిగా ఎంజాయ్ చేస్తున్నాయ‌ట‌. ఓ యువ‌కుడు అయితే ఏకంగా గూగుల్ రివ్యూస్‌లో తాను ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్లో బాగా ఎంజాయ్ చేశాన‌ని రాసుకువ‌చ్చాడు. ప్ర‌తి ఒక్క‌రు మోహ‌న్‌బాబు న‌ట‌న‌ను బాగా మెచ్చుకుంటున్నారు. నేను మాత్రం ఈ సినిమా తీసినందుకు మంచు విష్ణుకు థ్యాంక్స్ చెప్పాల‌ని అనుకుంటున్నా… తాను, త‌న ప్రియురాలు ఇద్ద‌రం ఈ సినిమాకు వెళ్లి బాగా ఎంజాయ్ చేశాన‌ని చెప్పాడు.

మామూలుగా ఓయో రూమ్‌కు వెళ్లాలంటే క‌నీసం రు. 800 ఖ‌ర్చ‌వుతుంది… ఈ సినిమాకు వెళ్ల‌డంతో నాకు ఆ డ‌బ్బులు మిగిలాయి అని… ఈ సినిమాకు తాను, త‌న ప్రియురాలు మ‌ళ్లీ వ‌స్తామంటూ పేర్కొన్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా స‌న్నాఫ్ ఇండియా సీక్వెల్స్‌గా 2, 3, 4 సినిమాలు కూడా తీయాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పాడు. ఈ సినిమాకు తాను 10 స్టార్స్ ఇవ్వాల‌ని అనుకున్నాను అని.. అయితే గూగుల్ ఐదు స్టార్స్ మాత్ర‌మే చూపిస్తున్నందున తాను 5 / 5 స్టార్స్ ఇస్తున్న‌ట్టు త‌న రివ్యూలో రాసుకువ‌చ్చాడు. ఆ రివ్యూ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news