Moviesర‌వితేజ ' ఖిలాడి ' ర‌న్ టైం డీటైల్స్‌... సినిమా టాక్...

ర‌వితేజ ‘ ఖిలాడి ‘ ర‌న్ టైం డీటైల్స్‌… సినిమా టాక్ ఎలా ఉందంటే..!

మాస్ మహారాజ రవితేజ క్రాక్ త‌ర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు. రాక్ష‌సుడు లాంటి రీమేక్ హిట్ త‌ర్వాత ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌మేష్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ చేసిన సినిమా ఖిలాడి. ర‌వితేజ స‌ర‌స‌న డింపుల్ హయాతి – మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా న‌టించారు. ర‌వితేజ కెరీర్‌లో హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

ఈ నెల 11న థియేట‌ర్ల‌లోకి రానున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఖిలాడికి సెన్సార్ బోర్డు యూ / ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా టోట‌ల్ రన్ టైం 154 నిమిషాలు. ఓవ‌రాల్‌గా 2.34 గంట‌ల ర‌న్ టైంగా ఉంది. మాస్ ఖిలాడీ డ‌బుల్ ట్రీట్ ఇస్తుంద‌ని సెన్సార్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ చేసిన ఈ సినిమా ప‌క్కా సాలిడ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కింది. సినిమాలో కావాల్సినంత యాక్ష‌న్‌తో పాటు అదిరిపోయే పంచ్ డైలాగులు ఉన్నాయ‌ట‌. ర‌వితేజ కెరీర్‌లో మ‌రో మాస్ హిట్‌గా ఖిలాడి నిలుస్తుంద‌ని అంటున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాను ఏ స్టూడియోస్‌, పెన్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news