Moviesసుశాంత్ కి అంత సీన్ లేదు..రవితేజకు లిప్ లాక్ ఇచ్చింది మాత్రం...

సుశాంత్ కి అంత సీన్ లేదు..రవితేజకు లిప్ లాక్ ఇచ్చింది మాత్రం అందుకే..మీనాక్షి ఫుల్ క్లారిటీ!!

ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజకు క్రాక్ సినిమా రూపంలో అభిమానులకు పిచ్చెక్కించే హిట్ సినిమాను ఇచ్చాడు డైరెక్టర్ గోపిచంద్ మల్లినేని. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు మన మాస్ మహా రాజ. ఇక ఆయన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ తో మనల్ని పలకరించబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’ ఫిబ్ర‌వరి 11న మన ముందుకు రాబోతుంది.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కింది.

ఈ సినిమాలో ఆయన ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు. వాళ్లే డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది నటి మీనాక్షి చౌదరి. ఇక రెండవ సినిమాకే స్టార్‌ హీరో మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే చాన్స్‌ కొట్టేసిందంటే అమ్మడు పర్ ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు.

2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది ఈ భామ ఆ తరువాత సినిమాలో అవకాశాలు రావడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాలెకపోయినా..ఆమె నటనకు మాత్రం మచి మార్కులే పడ్డాయి. ఇంకా చెప్పాలంటే సుశాంత్ కి అంత సీన్ లేదని..ఆయన కన్నా కూడా మీనాక్షి నే బాగా నటించింది అన్న కామెంట్లు కూడా వినపడ్డాయి.

తాజాగా ఆమె నటించిన చిత్రం ఖిలాడి మూవీ ప్రమోషన్లో భాగంగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె రవితేజ తో లిప్ లాక్ సీన్స్ లో నటించడం పట్ల క్లారిటీ ఇస్తూ.. “నా రెండవ సినిమానే రవితేజ గారి లాంటి బడా హీరో చేయడం నా అదృష్టం. ఇలాంటి ఛాన్స్ ఒకటి వస్తుంది అని నేను అనుకోళేదు. నాకు తెలుగు అంతగా రాదు. దీని వల్ల కొన్ని సీన్స్ లో ఇబ్బంది పడ్డ అంతే. అప్పుడు రవితేజ గారు నాకు చాలా హెల్ప్ చేసారు.

అందువల్లనే నేను నా పాత్రను సరిగ్గా చేయగలిగాను. ఇక రవితేజతో లిప్ లాక్ విషయానికి వస్తే .. అక్కడ ఆ కధకు ఆ సీన్ అవసరం అందుకే అలా చేశాం. సినిమా చూశాక మీకే అర్ధమౌతుంది..ఎందుకు లిప్ లాక్ సీన్స్ లో నటించానో’ అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో నేను ఇంత సేపు ఉండాలి అని అనుకోను ఉన్న కొంచెం సేపు అయిన నాపాత్ర బాగుండాలి..కధకు కు తన పాత్రకు ప్రాముఖ్యత ఉండాలి..అలాంటి సినిమాలో నటించదానికి నేను ఎప్పుడు రెడీ” అంటూ క్లారిటి ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news