Moviesదీపికా ఘాటైన రొమాన్స్ పై భర్త హాట్ కామెంట్స్..దొందు దొందే..!!

దీపికా ఘాటైన రొమాన్స్ పై భర్త హాట్ కామెంట్స్..దొందు దొందే..!!

బాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ రేంజ్ లో ఉన్న దీపికా పదుకునే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత కూడా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు.. కొత్తగా వెరైటీ గా ఉండే కధలను చూస్ చేసుకుంటూ..సరికొత్త రోల్స్ పోశించాలని చూస్తుంది. అందులో భాగంగా దీపికా యాసిడ్ దాడికి గురై.. ఆత్మ విశ్వాసాన్ని పోగేసుకుని నిజ జీవితంలో గెలిచిన లక్ష్మి అగర్వాల్ కథతో ఓ సినిమా చేసింది. ఇక ఇప్పుడు హీరో సిద్దాంత్ చతుర్వేది హీరోగా దీపికా హీరోయిన్ గా పూర్తిస్థాయి రొమాంటిక్‌, బోల్డ్‌ కంటెంట్‌ చిత్రం ‘గెహ్రాహియా’తో పలకరించనుంది.

ఇక ఈ సినిమాతో అమ్మడు ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ఎప్పుడు తిట్టని తిట్లు కూడా తిట్టించుకుంటుంది. దానికి కారణం అమ్మడు ఈ సినిమాలో హాట్ సీన్స్ లో నటించడమే. ఈ సినిమా ఫిబ్రవరి11న అమెజాన్ ఫ్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అమ్మడు బోల్డ్ గా నటించడం కాదు ..బరితెగించింది అంటున్నారు ఈ సినిమా చూసిన జనాలు. ఓ పెళ్లైన స్త్రీ ఇంత హాట్ గా రొమాంటిక్ గా ఎలా నటించగలిగావు అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్స్.

అయితే ఇంత హాట్ గా నటించిన తన భార్య దీపికాను పొగుడుతూ రీసెంట్ గా రణ్ వీర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టుకొచ్చాడు. దీంతో అభిమానులు భార్య భర్తలు ఇద్దరిని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. నీ భార్య వేరొకరిని ముద్దు పెట్టుకుంటుంటే పొగుడుతున్నవ్ ఏంటి బ్రదర్ ఇది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘గెహ్రాహియా’ లో ఆమె నటించిన తీరు గర్వంగా ఉందన్నా రణ్ వీర్.. వెకేషన్‌కు వెళ్లినప్పుడు ఆమెని ముద్దుపెడుతూ దిగిన ఫోటోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేస్తూ… ఆ ఫోటోతో పాటు అతడు రాసుకొచ్చిన ఇంగ్లీషు పదాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇక దీని చూసిన నెటిజన్స్ భర్త ఇంత ఫ్రీ బార్డ్ లా వదిలెస్తే ..భార్య బరి తెగించక ఏం చేస్తుంది అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news