Moviesసారీ..నన్ను క్షమించండి..స్టేజీ పైనే అసలు నిజం చెప్పేసిన కార్తీకేయ..!!

సారీ..నన్ను క్షమించండి..స్టేజీ పైనే అసలు నిజం చెప్పేసిన కార్తీకేయ..!!

యంగ్ హీరో కార్తికేయ..ఒక్కే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కార్తికేయ కు జంటగా పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు.. అందరిని మనసులను గెలుచుకుంది. ఇక ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు కార్తికేయ సినీ లైఫ్ ను ముందుకు తీసుకెళ్లకేకపోయాయి. ఆ మధ్య వచ్చిన ‘చావు కబురు చల్లగా’ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆయన టైం బాగోలేదు అనుకున్నారు. కానీ పెళ్లి తరువాత కార్తీ టైం బాగా నడుస్తున్నట్లు ఉంది. హిట్ కొట్టక పోయినా బడా బడా సినిమాలతో వరుస మూవీలకు సైన్ చేస్తున్నాడు.

రీసెంట్ గా ‘రాజా విక్రమార్క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఓ పక్క హీరోగా నటిస్తూనే.. మరోపక్క విలన్ రోల్స్ లో మెప్పిస్తున్నాడు కార్తికేయ. ప్రస్తుతం ఈ హీరో తమిళంలో ‘వాలిమై’ అనే సినిమాలో నటిస్తున్నారు.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టిస్తోన్న వ‌లిమై సినిమా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ బోనీక‌పూర్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా నిర్మించారు. చాలా రేసీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటేనే మ‌తులు పోతున్నాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న్ మంగళవారం ఫిబ్రవరి 22 గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. తన సినిమా విడుదల తేదీని మరిచిపోయి పొరపాటున నవంబర్ 24న అంటూ మాట్లాడేశాదు. ఇక ఆ తరువాత చాలా టైంకి పక్కన ఉన్న వాళ్లు మళ్ళీ గుర్తు చేస్తే.. తన తప్పు తెలుసుకుని.. సారీ అండి ఇందాక రిలీజ్ డేట్ తప్పు చెప్పాను..ఫిబ్రవరి 24 అయితే నవంబర్ 24 అని చెప్పా క్షమించండి. నవంబరు 24 నా మ్యారేజ్ రీసెప్షన్ డేట్ ..బై మిస్టేక్ అలా చెప్పేసాను సారీ అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ఖాకీ, నేర్కొండ పార్వై (పింక్ రీమేక్‌) సినిమాల‌ను డైరెక్ట్ చేసిన హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 24న ఈ సినిమా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. హీరో అజిత్‌కు పోటీగా కార్తీకేయ క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక ఫిబ్రవరి 24న మా వలిమై సినిమా చూడండి..

ఆ తరువాత ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా చూడండని అంటూ ఇరువురు హీరోల అభిమానులను కోరాడు కార్తికేయ. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్కర్లేదు. కార్తీకేయ సైతం ఈ సినిమాతో త‌న మార్కెట్ పెరుగుతుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయం తెచ్చిపెడుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news