Movies#NBK 107లో 8 ఫైట్లు... స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. !

#NBK 107లో 8 ఫైట్లు… స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. !

మైత్రీ మూవీస్ నిర్మాణంలో బాల‌య్య – మ‌లినేని గోపీచంద్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తెలంగాణ‌లోని సిరిసిల్ల జిల్లాలో మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ముందుగా కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు. బాల‌య్య అంటేనే యాక్ష‌న్‌, అటు మ‌లినేని గోపీచంద్ కూడా యాక్ష‌న్ డైరెక్ట‌రే. అందుకే ముందుగా రామ్ – ల‌క్ష్మ‌ణ్ నేతృత్వంలో ఓ ఫైట్ సీన్‌తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో అప్పుడే గాసిప్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి.

ఇక ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. బాల‌య్య బ్లాక్ చొక్కా వేసుకుని త‌న‌దైన స్టైల్లో ర‌ఫ్ లుక్‌తో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ లుక్ చూసిన వారంతా క‌న్న‌డంలో శివ‌రాజ్‌కుమార్ చేసిన మ‌ప్టీ సినిమాకు ఇది రీమేక్ అంటున్నారు. అయితే దీనిపై ఎవ్వ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక ఈ సినిమా హిట్ అయితేనే మ‌లినేని గోపీచంద్‌కు పెద్ద హీరోల నుంచి ఆఫ‌ర్లు ఉంటాయి. బాల‌య్య అఖండ త‌ర్వాత ఛాన్స్ ఇవ్వ‌డం మ‌లినేని గోపీచంద్‌కు పెద్ద ల‌క్కీయే.

ఇక మ‌లినేని క్రాక్ కేవ‌లం యాక్ష‌న్ సీన్ల వ‌ల్లే హిట్ అయ్యింది. ఇటు బాల‌య్య అఖండ‌కు అవే యాక్ష‌న్ సీన్లు హైలెట్‌. అందుకే మ‌లినేని ఈ సినిమాలో కూడా బాగా యాక్ష‌న్ సీన్లు ద‌ట్టించేశాడు. బాల‌య్య ఆయ‌న అభిమానులు శాటిస్‌పై చేయాల‌న్నా.. ఆయ‌న సినిమాలు హిట్ అవ్వాల‌న్నా యాక్ష‌న్ ఏ మాత్రం త‌గ్గ‌కూడ‌దు.. అందుకే మ‌లినేని గోపీచంద్ ఆ లెక్క‌లు బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎక్క‌డా గ్రాఫ్ త‌గ్గ‌కుండా ఉండేలా యాక్ష‌న్ సీన్లు రెడీ చేస్తున్నార‌ట‌.

మొత్తం మీద చిన్నా, పెద్దా క‌లుపుకుని 8 ఫైట్లు ఉంటాయంటున్నారు. ఆ మాట‌కు వ‌స్తే అఖండ సెకండాఫ్‌లో మొత్తం ఫైట్లే ఉన్నా కూడా బాల‌య్య అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఇక అఖండ‌లో డ‌బుల్ రోల్ క్లిక్ అయ్యింది. ఇక బాల‌య్య హిట్ సినిమాలు ఇటీవ‌ల డ‌బుల్ రోల్లోనే ఉన్నాయి. అందుకే ఆ సూత్రం ఇక్క‌డ కూడా గోపీచంద్ ఫాలో అవుతున్నాడ‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news