Moviesమెట్లు ఎక్కుతుంటే వెనుక నుంచి అలా..కుష్బూ తో వల్గర్ గా బీహేవ్...

మెట్లు ఎక్కుతుంటే వెనుక నుంచి అలా..కుష్బూ తో వల్గర్ గా బీహేవ్ చేసిన ఆ డైరెక్టర్..?

కుష్బూ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. ఒకప్పటి స్టార్ హీరోయిన్. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్ స్క్రీన్. కానీ ఈమె సినిమాలోకి వచ్చాక ఆ పేరును కుష్బూ గా మార్చుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి..సినీ ఇండస్ట్రిని ఏలిన నటి కుష్బూ. అందంగా, బొద్దుగా, ముద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే ఖుష్బూ ఒకప్పుడు తమిళ కుర్రకారు కలలు సుందరి. సిమ్లా యాపిల్ లా మెరిసిపోతూ ఉండే ఖుష్బూకి ఏకంగా తమిళనాడులో గుడి కట్టిన చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు తన అందంతో నటనతో కుర్రకారుని ఆకర్షించి డ్రీమ్ గర్ల్ గా ఉండిపోయింది.

అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన ఖుష్బూ 50 ఏళ్ళ వయసులోనూ తరగని అందం తన సొంతం అంటుంది. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయ్యిన ఈమె.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. చేసిన ప్రతి సినిమాలోను తన అందం. అభినయం,నటన తో ప్రేక్షకులను బాగా ఆకటుకుంది.కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఖుష్బూ.. అతి తక్కువ సమయంలో తెలుగులో టాప్ హీరోయిన్‏గా స్థానం సంపాదించుకుంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కలిసి నటించింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఖుష్బూ.

అయితే ఖుష్బూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైంది. చాలా కాలం తర్వాత తాజాగా ఈ హీరోయిన్ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.టాలెంటెడ్ హీరోస్ శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహర్లు . ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కుష్బూ పై అప్పట్లో ఓ స్టార్ డైరెక్టర్ ఆమె పట్ల వల్గర్ గా బీహేవ్ చేశాడట.

ఆమె షూటింగ్ కంప్లీట్ చేసుకుని మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తుండగా..వెనక నుండి ఆమె బ్యాక్ పై అసభ్యకరంగా టచ్ చేశాడట. ఆ టైంలో సినీ నిర్మాతలు కూడా అక్కడే ఉన్నారని..కానీ వాళ్లు ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారని..దీంతో ఆమెకు కోపం వచ్చి చెంప మీద లాగి కొట్టిందని ఓ ఇంటర్వ్యుల్లో ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ బడా నిర్మాత తనకు అందగా నిలబడాడని..అప్పుడు ఆయనతో పాటు అక్కడ షూటింగ్ లో ఉన్న కొందరు తనకు మద్దతుగా నిలిచారు అని ఆమె తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news