Moviesభీమ్లానాయ‌క్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా..!

భీమ్లానాయ‌క్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ అమ్మాయి ఎవ‌రో తెలుసా..!

ఒక‌ప్పుడు సినిమాల్లోకి రావాల‌న్నా.. వెండితెరపై చిన్న పాత్ర‌లో అయినా ఓ వెలుగు వెల‌గాల‌న్నా ఎంతో క‌ష్ట‌ప‌డాలి. అస‌లు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిర‌గాలో.. ఎన్నిసార్లు ఫొటో షూట్ చేయాలో.. ఎవ‌రికి ఎన్నిసార్లు న‌మ‌స్కారాలు పెట్టాలో… ఎన్ని మాట‌లు ప‌డాలో.. అబ్బో ఆ త‌రం బాధ‌లు చెప్ప‌లేం. అయితే అదంతా గ‌తం.. ఇప్పుడు ఉన్న‌ది అంతా సోష‌ల్ మీడియా యుగం.. చేతిలో ఫోన్‌, నెట్ ఉంటే చాలు.. ద‌మ్మున్న ఒక్క వీడియోతో ప్ర‌పంచాన్నే ఊపేయొచ్చు. అవ‌కాశాలు వాటంత‌ట అవే పరిగెత్తుకుంటూ వ‌స్తాయి.

ఇప్పుడు యూట్యూబ్‌లో పాపుల‌ర్ అవుతోన్న వారంతా అవ‌కాశాల కోసం తిర‌క్కుండానే అవ‌కాశాలు సొంతం చేసుకుంటున్నారు. అలా యూట్యూబ‌ర్స్ ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవ్వ‌రి రిక‌మెండేష‌న్ అవ‌స‌రం లేకుండా ఎంట్రీ ఇస్తున్నారు.. సెల‌బ్రిటీలు అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే మ‌రెంతో మంది యూట్యూబ‌ర్లు రాత్రికి రాత్రే సెల‌బ్రిటీలుగా మారి.. ఇంకా చెప్పాలంటే ఎంతోమంది వెండితెర స్టార్ల కంటే స్టార్లు అయిపోతున్నారు.

ఇక మ‌రికొంద‌రు షార్ట్ ఫిలింస్‌లో న‌టించి సూప‌ర్‌స్టార్లు అవుతున్నారు. అలాంటి వారికి కూడా బుల్లితెర‌తో పాటు వెండితెర మీద కూడా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కొంద‌రు బుల్లితెర స్టార్లు,, యూట్యూబ‌ర్లు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లోనే ఛాన్సులు కొట్టేస్తున్నారు. అస‌లు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రావాలంటే కొన్నేళ్ల పాటు క‌ల‌లు క‌నాలి.. ఎంతో టాలెంట్ ఉండాలి… రిక‌మెండేష‌న్లు ఉండాలి.. పైగా అదృష్టం ఉండాలి.. అయితే అవేవి లేకుండానే కొంద‌రు యూట్య‌బూర్లు స్టార్ హీరోల సినిమాల్లో త‌ళుక్కున మెరుస్తున్నారు.

తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌లై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించాడు. ప‌వ‌న్ ప‌క్క‌నే లేడీ పోలీస్‌గా మౌనికా రెడ్డి అనే అమ్మాయి న‌టించింది. మౌనికా రెడ్డి యూట్యూబ్‌లో తిరుగులేని టాలెంట్ ఉన్న అమ్మాయి.. ఆ టాలెంట్‌తోనే ఆమె వెండితెర ఛాన్స్‌. పైగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌న న‌టించే బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది.

యూట్యూబ్‌లో పాపుల‌ర్ అయిన సూర్య అనే వెబ్‌సీరిస్‌లో ఆమె న‌టించింది. దీంతో మౌనిక వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటోంది. ప్ర‌స్తుతం నిఖిల్ హీరోగా న‌టిస్తోన్న 18 పేజీస్ అనే వెబ్‌సీరిస్‌లో కూడా న‌టిస్తోంది. ఆహా, సోనీ లైవ్ లాంటి ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌పై వెబ్‌సీరిస్‌ల‌లో న‌టిస్తోంది. అలాగే విశ్వ‌క్‌సేన్ ఓరిదేవుడా సినిమాలో కూడా న‌టించే ఛాన్స్ కొట్టేసింది. వైజాగ్‌లో బీటెక్ చ‌దివిన ఈ అమ్మాయి.. ప్ర‌స్తుతం హెచ్ఆర్‌గా ఉద్యోగం చేస్తూనే యాక్టివ్ వైపు అడుగులు వేసింది. ఇలా అదృష్టం క‌లిసి వ‌చ్చి ఏకంగా సినిమా ఛాన్సులు కూడా ద‌క్కించుకుంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news