Moviesపవిత్ర జబర్దస్త్ లోకి ఎలా వచ్చిందో తెలుసా..అస్సలు నమ్మలేరు..!

పవిత్ర జబర్దస్త్ లోకి ఎలా వచ్చిందో తెలుసా..అస్సలు నమ్మలేరు..!

జబర్దస్త్..ఈ కామెడీ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.కామెడీ షో అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఇప్పటివరకు ఎన్నో కామెడీ షోలు వచ్చాయి కానీ జబర్దస్త్ కు వచ్చిన క్రేజ్ ఏ షోకు కూడా రాలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా స్టార్ట్ అయిన ఈ షో ఇప్పుడు టెలివిజన్ చరిత్రలోనే నెం 1 కామెడీ షో గా నిలిచింది. అంతేకాదు ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ బాగా పాపులర్ అయ్యారు. ఎంత గా వాళ్ళ పేర్లు మారుమ్రోగిపోతున్నాయంటే.. ఒక్కప్పుడు తినడానికి తిండి కూడా లేని వారు.. ఇప్పుడు కోట్లు కూడబెట్టి ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు అంతలా వీళ్లకు పేరు తెచ్చిపెట్టింది జబర్ధస్త్.

మనలో టాలెంట్ ఉంటే సర్పోదు..దానికి తగ్గ ఫ్లాట్ ఫాం కూడా కావాలి. అలాంటి వాళ్ళకి జబర్ధస్త్ ఒక చక్కటి వేదిక అనే చెప్పాలి. సుధీర్,శ్రీను,ఆది,అభి,చంటి లాంటి వాళ్లలో కామెడీ టాలేంట్ ను కోట్ల మంది ప్రజలకు పరిచయం చేసింది ఈ జబర్ధ్స్త్ షోనే. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి పోజీషన్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఇలానే ఈ మధ్య కాలంలో జబర్ధస్త్ షో తన కామెడీ టైమింగ్ తో అలరిస్తుంది పవిత్ర. చూసేందుకు పొట్టిగా ఉన్నా ఆమె వేసే పంచ్ లు బాగా పేలుతున్నాయి. ప్రేక్షకులకు కూడా ఆమె పర్ ఫామెన్స్ విపరీతంగా నచ్చడంతో ఆమె పలు సీరియల్ లో కూడా నటించే అవకాశం కొట్టేసింది.

భాస్కర్, వెంకీ మంకీస్, హైపర్ ఆది.. ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తున్న పవిత్ర.. జబర్దస్త్ లోకి ఎలా వచ్చింది, అసలు ఈమె ఎవరు ..అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈమె టిక్ టాక్ ద్వారా బాగా పాపులర్ ను సంపాదించుకుంది.. ఈమె వీడియోలను, జబర్దస్త్ కమడియన్ టీం లీడర్లు చూసి మంచి కామెడి టైమింగ్ ఉండడంతో..ఆమెను కాంటెక్ట్ అవ్వగా మొదట భయపడిన ఆమె ఆ తరువాత మెల్ల్గా జబర్దస్థ్ లోకి వచ్చి సెటిల్ అయ్యిపోయింది.

ఎటువంటి డైలాగ్ ను అయిన అవలీలగా చెప్పేసే పవిత్ర ప్రస్తుతం సినిమాలో కూడా చేస్తుందట. దాదాపు ఈమె ఐదు సినిమాల్లో కమెడీ పాత్రలు చేస్తుందట. దీంతో పాటు పలు సీరియల్స్ లోకూడా నటిస్తుండటంతో జబర్ధస్త్ కి ఎక్కువ టైం కెటాయించలేకపోతుందట పవిత్ర. ఏది ఏమైన జబర్ధస్త్ షో చాలా మంది కి లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news