Moviesఛీ..ఏంటి ఈ పనులు సిగ్గులేకుండా..ఫస్ట్ టైం సుమ పై ఫైర్ అవుతున్న...

ఛీ..ఏంటి ఈ పనులు సిగ్గులేకుండా..ఫస్ట్ టైం సుమ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్..?

సుమ..ఈ పేరు కి స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. తన వాక్చాతుర్యంతో ఎటువంటి వారినైనా ఇట్టే ఆకట్టుకోలగా యాంకర్ సుమ.. గత కొంత కాలంగా బుల్లితెరను ఏలేస్తుంది. తెలుగు యాంకర్స్ లలో స్టార్ సినిమా నుండి చిన్న సినిమా వరకు ఈవెంట్ ఏదైనా సినిమా ఫంక్షన్ అనగానే అందరికి గుర్తొచ్చే యాంకర్ సుమ. ఎన్నో ఏళ్లుగా ఎవరెవరో వస్తున్నా పోతున్నా సుమ మాత్రం యాంకరింగ్ చేస్తూనే ఉంది.. ఉంటుంది.

ఇండస్ట్రీలో సుమ తో పాటు చాలా మంది యాంకర్స్ ఉన్నారు. అయితే దాదాపు అందరు కూడా ఏదో ఒక సందర్భంలో నెగిటివ్ కామెంట్స్ అందుకున్న వారే. కానీ సుమ యాంకరింగ్ చేస్తే మాత్రం అసలు నెగిటివ్ కామెంట్స్ అనేవి కూడా పెద్దగా కనిపించవు. ఆమె చాలా పాజిటివ్ గా ఎలాంటి ఈవెంట్ ను అయినా సరే సక్సెస్ ఫుల్ గా గా కొనసాగిస్తూ ఉంటారు. అయితే, ఫస్ట్ టైం నెట్టింట సుమ పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. అందుకు కారణం రీసెంట్ గా క్యాష్ ప్రోగ్రాం కు వచ్చిన ఓ పెళ్లి కానీ జంటతో వేయించిన స్టెప్పులే.

స్టార్ యాంకర్ సుమ చాలా ఏళ్లుగా ‘క్యాష్’ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పు కొత్త సెలబ్రిటిలతో తనదైన స్టైల్ లో ఆట ఆడుకుంటుంది సుమ. రీసెంట్ గా ఈ షో కి బుల్లి తెర స్టార్ నటులు రవి కృష్ణ, నవ్యస్వామీ, విష్ణు ప్రియ , సిద్ధార్ధ్ వచ్చారు. ఇక వాళ్లను అహ్వానిస్తూ సుమ తన స్టైల్ పంచ్ లు వేస్తూ కామెడీని పండించింది. అంత వరకు బాగానే ఉన్నా కానీ..ఆ తరువాత సుమ లిప్ స్టిక్ లీగ్ అంటూ..ఓ గేం ఆడారు.

ఈ టాస్క్ లో రీయల్ లైఫ్ కపు విష్ణు,సిద్ధు పార్టిసిపెట్ చేసారు. విష్ణు తన భర్త కు లిప్ స్టిక్ మార్క్ పడేలా ముద్దులులు పెట్టాలి. ఇక ఆ తరువాత రీల్ కపుల్ రవి, నవ్యతో సుమ “ఊ అంటావా మావ సిగ్నేచర్ స్టెప్పులు” వేయించింది. ఇక దీంతో కొందరు నెటిజన్స్ ఆమె పై మండిపడుతున్నారు. పెళ్లి అయిన వారితో నలుగురిలో అలా ముద్దులు పెట్టించడమే కాకుండా..పెళ్లి కాని వారితో ఒక్కరి ఒళ్లో ఒకరు కూర్చోని ఏంటి ఈ ఛండాలమైన పనులు సుమ అంటూ నెగిటివ్ కామెంట్స్ తో తిట్టిపోస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news