Moviesప్రేమదేశంలో అబ్బాస్ కి ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా..అస్సలు నమ్మలేరు..!!

ప్రేమదేశంలో అబ్బాస్ కి ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసా..అస్సలు నమ్మలేరు..!!

“ప్రేమ” రెండు అక్షరాల పదం. చూసేందుకు చిన్నదే అయినా..చదివేందుకు సులువుగా ఉన్నా..ఇది పెట్టే చిచ్చు..కలిగించే ఆనందం రెండు అనుభవిస్తే కాని తెలియదు. అందుకే ప్రేమ అగుడ్డిది అంటారు అందరు. ప్రేమ లో పడప్పుడు ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఎవ్వరికి ఏం కనపడవు ఏం వినపడవు. ఈ ప్రేమ అనే పదం చాలా మంది జీవితాల్లో ఆనందం నింపింది..విషాదాని నింపింది. ఇక ప్రేమ అనే కాన్సెప్ట్ తో..కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి.

కానీ అన్ని సినిమాల్లోఖి ప్రత్యేకం ఈ “ప్రేమ డేశం”. 1996లో దర్శకుడు కదిర్‌ చేసిన సంచలనమే ‘కాదల్‌ దేశం’. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోని కుర్రకారుని ఒక రకమైన ఉన్మాదంలో ముంచెత్తిందని చెప్పుకోవాలి. ప్రేమ, స్నేహాలకు ముఖ్యమైన విలువ ఏర్పడే టీనేజ్‌లో ఉన్న వాళ్లందరూ ఈ సినిమాను పదే పదే చూశారు.

“ప్రేమదేశం” సినిమా ఎంతటి ఘన విజయం సాధిందో మనకు తెలిసిందే. అప్పట్లో రికాడ్లు తిరగరాసి సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా లో అబ్బాస్, వినీత్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో టబు నటించడం జరిగింది. ఈ సినిమాతో అబ్బాస్ కి వినీత్ కి మంచి క్రేజ్ వచ్చింది. నిజానికి అబ్బాస్ కు ఇది మొదటి సినిమా కానీ తెర పై ఆయన నటన చూసిన వారు ఎవ్వరు కూడా అలా ఫీల్ అవ్వలేదు. బాగా అనుభవం ఉన్న నటుడి లానే యాక్ట్ చేశారు. అయితే మొదట ఈ సినిమాలో అబ్బాస్ చేయకూడదని నిర్ణయించుకుని రిజెక్ట్ చేసాడట.

అస్సలు అబ్బాస్ కు ఈ సినిమాలో హీరోగా అవకాశం ఎలా వచ్చిందంటే..కథ రాసుకున్న సమయంలోనే కార్తిక్ గా వినీత్ ను ఎంచుకున్నాడు దర్శకుడు కదిర్. ఇక అరుణ్ పాత్ర కోసం ఎవ్వరైతే బాగుంటారా అని తెగ ఆలోచించారట. బోలెడు మంది హీరోలను ట్రై చేసారట కానీ వర్క్ అవుట్ అవ్వలేదట. చివరకు ముంబయ్ నుండి హాలీ డే ట్రిప్ మీద బెంగళూరు వచ్చిన అబ్బాస్ ని ఓ హోటల్ లో చూసారట డైరెక్టర్. చూడగానే అట్రాక్ట్ అయిపోయిన డైరెక్టర్ .. అతణ్ణి తన అరుణ్ పాత్ర కోసం అడిగాడట.

అయితే సినిమాల్లో నతించాలని ఉన్నా..అవకాశం మచిదే అయినా కానీ తమిళం తెలియక పోవడంతో అబ్బాస్..ఈ సినిమాను రిజెక్ట్ చేసారట. కదిర్ ఇచ్చిన ఆఫర్ ను వద్దనుకుని వెళ్ళిపోయాడట. అయితే కొద్దిరోజుల తరువాత నిర్మాత కె.టి.కుంజుమోన్ ఫోన్ చేసి, అబ్బాస్ ను మేకప్ టెస్ట్ కు రమన్ని పిలిచి.. అబ్బాస్ కు క్లీయర్ గా అర్ధం అయ్యేలా ఈ సినిమా తరువాత తన లైఫ్ ఎలా ఉంటుందో వివరించాడట. ఎట్టేకేలకు ఫైనల్ గా అరుణ్ పాత్రలో అబ్బాస్ నటించడానికి ఒప్పుకుని సినిమా చేశాడు. ఇక ఈ సినిమాలో అబ్బాస్ పాత్రకు నటుడు విక్రమ్ తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ సినిమా సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ సినిమా అంటే పడి చచ్చిపోయేవాళ్ళు ఇంకా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news