Moviesహాట్ జ్యోతికి రెండో పెళ్లి... మొద‌టి భ‌ర్త‌కు అందుకే విడాకులిచ్చిందా..!

హాట్ జ్యోతికి రెండో పెళ్లి… మొద‌టి భ‌ర్త‌కు అందుకే విడాకులిచ్చిందా..!

రెండు దశాబ్దాల క్రితం జ్యోతి అంటే తెలుగు సినీ అభిమానుల్లో ఎంతో పాపులారిటీ ఉండేది. జ్యోతి సినిమాలో ఉంది అనగానే తెలుగు సినీ అభిమానులు వ్యాంప్‌ క్యారెక్టర్ ను ఫిక్స్ అయిపోయేవారు. జ్యోతి కెరీర్ స్టార్టింగ్ లో వ‌రుస‌ పెట్టి ఆ తరహా క్యారెక్టర్లు చేయడంతో ఆమెకు వ్యాంప్ ముద్ర‌ వచ్చేసింది. ఎస్‌వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన పెళ్ళాం ఊరెళితే సినిమాలో జ్యోతి చేసిన వ్యాంప్‌ క్యారెక్టర్ ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. తరువాత నాలుగైదు సినిమాల్లో జ్యోతి అదే తరహా పాత్రలు చేసింది. ఆ తర్వాత ఆమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు రైడింగ్ లో అడ్డం గా దొరికిపోయిన అన్న వార్తలు వచ్చాయి.

ఆ ఇమేజ్ వచ్చాక జ్యోతి కెరీర్ స్లో అయింది. ఇప్పట్లో జ్యోతి పెద్దగా కనపడట్లేదు కానీ.. ఒకప్పుడు ఆమె చేసిన బోల్డ్‌ క్యారెక్టర్లు.. ఈ వ‌య‌స్సులోనూ క‌వ్వించే ఆమె అందం ఇప్పటికీ ఆమెకు కొంతమంది అభిమానులు ఉండేలా చేశాయి. జ్యోతి తన హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ చాలా చలాకీగా కనిపించే జ్యోతి జీవితంలో క‌న‌ప‌డ‌ని చాలా ఆవేదన ఉంది.

జ్యోతి వయసులో తనకన్నా రెండేళ్ళ చిన్నవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి దుబాయ్ లో కాపురం పెట్టింది. రెండేళ్లకే వీరి వైవాహిక జీవితంలో కలతలు రావడంతో ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. పెళ్లయిన వెంటనే తనకు ప్రెగ్నెన్సీ రావడంతో భర్తతో దూరంగా ఉండాల్సి వచ్చిందని… తన కంటే చిన్నవాడు అయినా భర్త తన‌పై బాగా డామినేషన్ చేసేవాడని… ఇక అతని కుటుంబ సభ్యులు కూడా తన భర్తకే సపోర్ట్ చేయడంతో… తాను అక్కడ ఉండలేక పోయాను అని జ్యోతి వాపోయింది.

యంగ్ ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య మెచ్యూరిటీ లేదని కూడా జ్యోతి చెప్పుకుని బాధపడింది. ఇద్దరి మధ్య ఇగోలు ఎక్కువగా ఉండడంతో త్వరగానే విడిపోవాల్సి వచ్చింది అని చెప్పింది. ప్రస్తుతం తాను తన బిడ్డతో కలిసి ఉంటున్నానని చెప్పిన జ్యోతి తాను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని… అయితే అది ప్రేమ వివాహమే అవుతుందని షాక్ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news