Moviesఆ ద‌ర్శ‌కుడితో ర‌వితేజ‌కు తేడా కొట్టిందా.. అందుకేనా ఈ సెటైర్లు...?

ఆ ద‌ర్శ‌కుడితో ర‌వితేజ‌కు తేడా కొట్టిందా.. అందుకేనా ఈ సెటైర్లు…?

మాస్ మహారాజా రవితేజ – ర‌మేష్‌వ‌ర్మ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఖిలాడి సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ వేళ ర‌వితేజ‌కు, ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వ‌ర్మ‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌నే ప్ర‌చారం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అందుకు ర‌వితేజ చేసిన వ్యాఖ్య‌లు కూడా కార‌ణంగా ఉన్నాయ‌ని అంటున్నారు. ర‌వితేజ స‌హ‌జంగా ఎవ్వ‌రిపై సెటైర్లు వేసేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ర‌వితేజ మాట‌ల్లో సెట‌ర్ కనిపించింది.

గ‌త కొద్ది రోజుల నుంచే ర‌వితేజ‌, ర‌మేష్‌వ‌ర్మ మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌న్న ప్ర‌చారం అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. ఈ సినిమాను ర‌వితేజ ఈ నెల 18న రిలీజ్ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయితే ద‌ర్శ‌కుడు, నిర్మాత మాత్రం ఈ నెల 11నే రిలీజ్ చేయాల‌ని పంతానికి పోయారు. చివ‌ర‌కు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెప్పిన‌ట్టు 11నే సినిమా రిలీజ్ అవుతోంది. ఇక ప్రి రిలీజ్ ఈవెంట్ సంద‌ర్భంగా ర‌వితేజ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడిపై ప‌రోక్షంగా సెటైర్ వేశారు. అస‌లు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కే ర‌వితేజ ఆల‌స్యంగా వ‌చ్చారు.

ర‌వితేజ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు ర‌మేష్‌వ‌ర్మ చాలా ల‌క్కీ అని… ఆయ‌న సినిమాకు ఏం కావాల్సినా చేసే నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ దొరికొరాని.. అంతే కాకుండా సినిమా రిలీజ్‌కు ముందే కాస్ట్ లీ కారు గిఫ్ట్‌గా పొందారంటేనే ర‌మేష్‌వ‌ర్మ ఎంత అదృష్ట‌వంతుడో తెలుస్తోంద‌ని చెప్పాడు. అయితే ఇందులో ఇండ‌స్ట్రీలోని కొంద‌రు మాత్రం ర‌వితేజ సెటైర్ వేశాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు. సినిమా తీస్తున్న‌ప్పుడు అంతా వ్య‌క్తిత్వంతో చూసుకోవాల‌ని.. శ్రీకాంత్ విస్సా చెప్పిన క‌థ విని.. నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌తో త‌నకు ఉన్న అనుబంధం నేప‌థ్యంలో తాను ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాన‌ని చెప్పారు.

అలాగే శ్రీకాంత్ విస్సాను త‌న‌కు ప‌రిచ‌యం చేసినందుకు ర‌మేష్‌వ‌ర్మ‌కు కూడా ర‌వితేజ థ్యాంక్స్ చెప్పారు. ర‌వితేజ మాట‌ల్లో ద‌ర్శ‌కుడి కంటే రైట‌ర్ శ్రీకాంత్‌కే ఎక్కువ ప్రాధాన్యం క‌నిపించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అంత‌కు ముందే ర‌వితేజ – ర‌మేష్ వ‌ర్మ మ‌ధ్య ఉన్న గ్యాప్ నేప‌థ్యంలోనే ర‌వితేజ కాస్త నొచ్చుకునే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు.

ఇక సినిమా డ‌బ్బింగ్ ఆల‌స్యం కావ‌డంతో కూడా ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇవ‌న్నీ ర‌వితేజ‌కు న‌చ్చ‌లేద‌ని అందుకే నిర్మాత‌, ద‌ర్శ‌కుడిపై కాస్తంత అస‌హ‌నంతో ఉన్నార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news