Moviesబాల‌య్య‌తో షీల్డ్ తీసుకుని... బాల‌య్య‌కు హీరోయిన్ అయిపోయింది.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

బాల‌య్య‌తో షీల్డ్ తీసుకుని… బాల‌య్య‌కు హీరోయిన్ అయిపోయింది.. ఇంట్ర‌స్టింగ్ స్టోరీ..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 106 సినిమాలు పూర్త‌య్యాయి. ఆయ‌న కెరీర్‌లో తాజాగా వ‌చ్చిన అఖండ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఇన్నేళ్ల బాల‌య్య కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో ఆయ‌న న‌టించారు. కొంద‌రు హీరోయిన్లు బాల‌య్య‌కు బాగా ల‌క్కీ. బాల‌య్య – ఆ హీరోయిన్ కాంబినేష‌న్ అంటేనే చాలు ప్రేక్ష‌కుల్లో మామూలు అంచ‌నాలు ఉండేవి కావు. బాల‌య్య – విజ‌య‌శాంతి కాంబినేష‌న్లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. బాల‌య్య ప‌క్క‌న ఎంత మంది హీరోయిన్లు న‌టించినా కూడా విజ‌య‌శాంతి ఉంటే ఈ క్రేజ్ వేరుగా ఉండేది.

అప్ప‌ట్లో తెలుగు సినిమా అభిమానులు కూడా బాల‌య్య – విజ‌య‌శాంతి సినిమా అంటే సినిమా టాక్‌తో సంబంధం లేకుండా థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టేవారు. ఆ త‌ర్వాత బాల‌య్య – సిమ్రాన్ కాంబినేష‌న్‌కు కూడా క్రేజీ కాంబినేష‌న్‌గా పేరొచ్చింది. వీరిద్ద‌రి కాంబోలోనే స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు లాంటి ఇండ‌స్ట్రీ హిట్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత గొప్పింటి అల్లుడు, సీమ‌సింహం సినిమాల్లో కూడా వీరు క‌లిసి న‌టించారు.

ఆ త‌ర్వాత బాల‌య్య‌కు శ్రియ బెస్ట్ కాంబినేష‌న్ అయ్యింది. ఇదిలా ఉంటే బాల‌య్య – మీనా కాంబినేష‌న్లో హిట్ సినిమాలు వ‌చ్చాయి. అయితే వీరి కాంబినేష‌న్లో సినిమాలు రావ‌డానికి ముందు ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. విజ‌య‌శాంతి హీరోగా తెర‌కెక్కిన క‌ర్త‌వ్యం సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా 100 రోజులు ఆడింది. వంద రోజుల వేడుక‌కు బాల‌య్య ముఖ్య అతిథిగా వ‌చ్చారు.

ఈ ఉత్స‌వంలో ఈ సినిమాలో న‌టించిన మీనా బాల‌య్య చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నారు. ఆ త‌ర్వాత అదే మీనా బాల‌య్య‌కు హీరోయిన్‌గా చేసింది. వీరిద్ద‌రు క‌లిసి బొబ్బిలి సింహం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించారు. కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రోజా మ‌రో హీరోయిన్. ఆ త‌ర్వాత బాల‌య్య – మీనా కాంబోలో అశ్వ‌మేధం – ముద్దుల మొగుడు – కృష్ణబాబు సినిమాలు వ‌చ్చాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news